Kajal Aggarwal: నా కొడుకుకి మొదట ఆ సినిమానే చూపిస్తాను: కాజల్

Kajal Aggarwal: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ తనకంటూ గుర్తింపును ఏర్పరచుకుంది కాజల్. టాలీవుడ్ లో చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా మొదట కాజల్ లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 

ఆ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు రావడంతో అతి తక్కువ సమయంలోనే ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ రేంజ్ కి దిగింది. ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. కాజల్ కొడుకు పేరు నీల్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కొడుకుతోనే వీలైనంత సమయాన్ని ఎక్కువగా గడుపుతోంది కాజల్. ఇది ఇలా ఉంటే తాజగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అలాగే కొడుకు నీల్ గురించి మాట్లాడుతూ..

తన కుమారుడు నీల్ కి ఎనిమిదేళ్ల వయసు వచ్చే వరకు సినిమాలకు దూరంగా ఉంచాలనుకుంటున్నట్లు తెలిపింది. అలానే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి అందించకుండా పెంచాలనుకుంటున్నట్లు తెలిపింది. అదేవిధంగా తన కొడుకుకి తొలిసారిగా విజయ్ హీరోగా నటించిన తుపాకీ సినిమా చూపించాలనుకుంటున్నట్లు ఆమె తెలిపింది. తుపాకీ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. మురుగదాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ మూవీ రిలీజ్ తరువాత ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో మనందరికీ తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -