Hyderabad: బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు.. కానీ?

Hyderabad: ఈ మధ్య కాలంలో విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. క్షణికావేశంలో ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా చదువుకుంటున్న విద్యార్థులు చిన్న చిన్న కారణాలకే పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నాను. చాలా వరకు విద్యార్థులు చదువు విషయంలో ఒత్తిడిని ఎదుర్కొనలేకపోతున్నారు. తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక, అటు చదువులోనూ రాణించలేక ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

 

హైదరాబాద్ బాలానగర్ ఓల్డ్ విలేజ్ లో నివాసం ఉంటున్న వన్నెల పావని అనే 19 ఏళ్ల యువతి బేగంపేట్‌లోని గర్ల్స్ డిగ్రీ ప్రభుత్వ కాలేజీలో బీకాం సెకండ్‌ ఇయర్‌ చదువుతుంది. అయితే గత కొంతకాలంగా సరిగా చదువలేకపోతున్నాను అని ఆలోచిస్తూ డిప్రెషన్‌లోకి వెళ్లింది పావని. ఇక తాను చదువు పై శ్రద్ధ పెట్టలేనని భావించిన పావని. ఊహించిన విధంగా దారుణమైన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలని వమ్ము చేస్తున్నానని భావించిన పావని తన జీవితానికే ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు కుమార్తె శవం ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా గుండెలో వెలిసేలా రోదించారు.

ప్రాణంగా పెంచుకున్న బిడ్డ అలా కనిపించేసరికి తల్లిదండ్రులకు నోట మాట పడిపోయింది. చదువొక్కటే జీవితం కాదు కదా తల్లి నువ్వు మా కళ్ల ముందు ఉంటే అదే పదివేలు. ఇంత దారుణం ఎలా చేయాలనిపించింది. చనిపోయేముందు ఒక్కసారైనా మేము గుర్తుకు రాలేదా ఎందుకు మాకు ఇంత కడుపుకోత మిగిల్చావు అంటూ ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు వర్ణనాతీతం.
ఊరేసుకునేముందు మేము మీకు గుర్తుకు రాలేదా తల్లి మాకు ఎందుకు ఇంత కడుపుకోత మిగిల్చావ్‌ అంటూ గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పావని ఆత్మహత్య చేసుకోవడానికి చదువు కారణామా లేక ఇంకా ఏమైన కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: అలా జరిగి ఉంటే ఓట్లు అడిగేవాడిని కాదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nara Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం సభలో మాట్లాడారు. జగన్ పాలన గురించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి...
- Advertisement -
- Advertisement -