Devotional: ఈ నాలుగు కలలు వస్తే చాలు రాజయోగం పట్టినట్టే?

Devotional: సాధారణంగా పడుకున్నప్పుడు కలలు రావడం అన్నది సహజం. కొన్నిసార్లు మంచి కలలు వస్తే మరికొన్నిసార్లు పీడకలు వస్తూ ఉంటాయి. మరి కొన్నిసార్లు కొంతమందికి కలలో దేవుడు కనిపించారని, దేవుడికి సంబంధించిన కలలు వచ్చాయని చెబుతూ ఉంటారు. అయితే కలల శాస్త్ర ప్రకారం మనకు కలలో కనిపించే కొన్ని రకాల సంఘటనలు మాత్రమే మన భవిష్యత్తుకు సంబంధం కలిగి ఉంటాయి. కొన్ని రకాల సంఘటనలు మాత్రమే భవిష్యత్తులో నిజం అవుతూ ఉంటాయి. భవిష్యత్తులో జరగబోయే వాటికి ఉదాహరణగా మనకు ఒక కలలో కొన్ని కనిపిస్తాయి.

ఆ విషయాలను ముందుగా పరిశీలిస్తే భవిష్యత్తులో జరగబోయే కొన్ని పసిగట్టవచ్చు. అంతే కాకుండా జరగకూడనివి ఏవైనా జరిగితే ముందుగా కాపాడుకోవచ్చు. ఇకపోతే అసలు విషయంలో వెళితే.. మనకు కలలలో నాలుగు రకాల కలలు కనిపిస్తే త్వరలోనే మంచి జరగబోతుందని ఆర్థికంగా లాభాలు చేకూర బోతున్నాయని అర్థం. మరి ఆ నాలుగు రకాల కలలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తెల్ల తామర పువ్వు కలలో కనిపిస్తే అది శుభప్రదం గా భావించాలి. తామర పువ్వు లక్ష్మి దేవికి ఎంతో ఇష్టం. కాబట్టి ఈ పువ్వు కలలో కనిపిస్తే మీరు భవిష్యత్తులో డబ్బు పొందుతారని అర్థం. అలాగే కలలో మనకు చెట్లు, మొక్కలు కనిపించినా కూడా మంచిదే.

 

అలాగే అవి పండ్లతో నిండిన చెట్లు అయితే మీరు త్వరలోనే ధనవంతులు కానున్నారని అర్థం. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపారంలో బాగా కలిసి వస్తుందని లాభాలు పొందుతారని అర్థం. అదేవిధంగా కలలో ఏనుగులు కనిపించినా కూడా శుభప్రదంగా భావించాలి. హిందువులు ఏనుగును పవిత్రంగా భావిస్తారు. అటువంటి ఏనుగు కలలో కనిపిస్తే ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోబోతున్నారని అర్థం. కలలో రాజ భవనం కనిపిస్తే శుభప్రదంగా భావించాలి. కలలో రాజభవనం కనిపించింది అంటే మీరు త్వరలో ఎక్కడ నుండి అయినా డబ్బు పొందుతారని అర్ధం. ఈ విధమైన నాలుగు రకాల కలలు రావడం వల్ల ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోవడంతో పాటు ఆర్థికంగా లాభాలు చేకూరతాయి.

Related Articles

ట్రేండింగ్

Ys Bharathi Reddy: పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు.. రైతుల ప్రశ్నలకు సమాధానం చెబుతారా?

Ys Bharathi Reddy: ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ప్రచారం జోరుగా సాగుతోంది. సమయం దగ్గర పడటంతో వారికి మద్దతుగా వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. మొన్నటికి మొన్న పవన్...
- Advertisement -
- Advertisement -