RRR : ఆస్కార్ తో హిస్టరీ క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్?

రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన సినిమా ఆర్ఆర్ఆర్. మల్టీస్టారర్ గా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటించగా ఈ సినిమాతో వారికి కూడా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చింది. ఇక ఇందులో వచ్చిన పాటలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. టాలీవుడ్ గర్వించే తగ్గ ఈ సినిమా రూపొందింది. అంతేకాకుండా ఇప్పటికే పలు అవార్డులు అందుకొని చరిత్ర సృష్టించింది.

ఇక తాజాగా 95 వ ఆస్కార్ అవార్డు వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు అవార్డు అందింది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో పాటు గీత రచయిత చంద్రబోస్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కీరవాణి కాస్త భావోద్వేగంతో మాట్లాడాడు. తన మనసులో ఒకే ఒక కోరిక ఉండేదని.. అది ఆర్ఆర్ఆర్ గెలవాలి అని.. ఇది ప్రతి ఇండియన్ కి గర్వకారణం అంటూ.. ఆర్ఆర్ఆర్ తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని.. ఆర్ఆర్ఆర్ దేశాన్ని గర్వపడేలా చేసింది అని మాట్లాడారు.


ఇక ఈ పాటతో పాటు మరో నాలుగు పాటలు కూడా ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయ్యాయి. ఇక నాటు నాటు పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఇక ఈ పాటకు ఎన్టీఆర్, రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేసి అందరిని ఫిదా చేశారు. ఇక ఈ పాట గురించి వేడుకలో అనౌన్స్ చేసిన వెంటనే అక్కడున్న ఆర్ఆర్ఆర్ టీమ్ కేరింతలతో గెంతులు వేసినట్లు తెలిసింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం కథ పరంగానే కాకుండా పాటల పరంగా కూడా అద్భుతమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -