Relationship: ఎక్కువసార్లు సెక్స్ చేస్తున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Relationship: సాధారణంగా భార్యాభర్తలు తరచుగా శృంగారంలో పాల్గొనాలి అని అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు స్త్రీలు ఎక్కువ శృంగారంలో పాల్గొనాలి అని భావిస్తే మరికొన్నిసార్లు పురుషులు ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనాలి అని భావిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఎక్కువ సార్లు శృంగారం చేయడం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా లేకుంటే ప్రయోజనాలు ఉంటాయా అని సందేహబడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం నిపుణులు ఒక అధ్యయనాన్ని జరిపారు. ఆ అధ్యయనం ద్వారా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భార్యభర్తలు ఎంత ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే వారి జీవితం అంత హ్యాపీగా ఉంటుంది. కాకపోతే కొన్ని మినహాయింపులు అంటున్నారు నిపుణులు.

ఒక జంట సంవత్సరానికి 54 రోజులు సెక్స్ లో పాల్గొంటుందట. అనగా వారానికి కేవలం ఒక్కరోజు మాత్రమే. కాగా వారానికి ఒకసారి సెక్స్ లో పాల్గొనే జంటలు తరుచూ సెక్స్ చేసుకునే వారికంటే ఎక్కువ సంతోషంగా ఉంటారు. అలాగే 30 ఏళ్ళ లోపు వయసు వారు సంవత్సరానికి 112 సార్లు అనగా వారానికి రెండుసార్లు సెక్స్ చేస్తారట. 30, 39 ఏళ్ల మధ్య వయసున్నవాళ్లు సంవత్సరానికి 86 సార్లు శృంగారంలో పాల్గొంటారు. అలా వయసు పెరిగే కొద్దీ ఏడాదిలో సెక్స్ లో పాల్గొనే సంఖ్య కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది. అయితే ఇందుకు గల కారణం రోజులు గడుస్తున్న కొద్దీ శృంగార కోరికల పై ఆసక్తి తగ్గడం.

 

యవ్వనంలో ఉన్నప్పుడు ఏర్పడే చెడు అలవాట్లు అంటే సిగరెట్లు, మందు, డ్రగ్స్, ఎక్కువమంది అమ్మాయిలతో తిరగడం లాంటివి కూడా వయసు పై బడుతున్న కొద్దీ తమ ప్రభావాన్ని చూపిస్తాయి. ఆరోగ్యవంతమైన శృంగార జీవితం దీర్ఘకాలం ఉండాలంటే జీవనశైలిని మెరుగుపరుచుకోవాలి. చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండాలి. పోషకాహారం తీసుకుంటూ తరుచూ వ్యాయామం చేయాలి. తరుచూ సెక్స్ లో పాల్గొంటేనే శృంగార జీవితం రసమయభరితమవుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే. కాకపోతే జీవిత భాగస్వామితో కలిసిన ప్రతీసారి ఇద్దరూ భావప్రాప్తి పొందారా? ఆప్యాయంగా సంభాషించుకున్నారా అనేదే ముఖ్యం. శృంగారం అంటే ఇద్దరు వ్యక్తుల శారీరక, మానసిక పరమైన ఉల్లాసవంతమైన చర్య అని, దీనివల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడుతుంది. శృంగారంలో పాల్గొనడం మంచిదే కానీ శృతిమించి శృంగారంలో పాల్గొనడం మంచిది కాదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -