Lakshmi Gavvalu: లక్ష్మీ గవ్వల గురించి తెలుసా.. వీటి వల్ల ఇన్ని లాభాలా?

Lakshmi Gavvalu: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్, సిస్టమ్స్ లో ఆన్లైన్ గేమ్స్ కీ అలవాటు పడిపోయారు. కానీ ఒకప్పుడు asta అష్టాచెమ్మా, పులి మేక లాంటి ఆటలు ఆడేవారు. అయితే అష్టా చెమ్మా ఆట‌ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి గ‌వ్వ‌లు. అయితే ఆ గ‌వ్వ‌ల్లోనే ల‌క్ష్మీ దేవి గ‌వ్వ‌లు కూడా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఆ లక్ష్మి గవ్వలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మరి ముఖ్యంగా సంపద శ్రేయస్సు కలుగుతుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అప్పట్లో ఈ ల‌క్ష్మీ గ‌వ్వ‌ల‌ను డ‌బ్బుకు బ‌దులుగా ఉప‌యోగించేవార‌ట‌.

కానీ అవి కాల‌క్ర‌మేణా తక్కువ అయ్యాయి అనడం కంటే కనుమరుగైపోయాయి అని చెప్పవచ్చు. కాగా ల‌క్ష్మీ గ‌వ్వ‌ల‌ను ఇంట్లోని పూజ మందిరంలో పెట్టి పూజించడం వల్ల నిజంగానే ల‌క్ష్మీ క‌టాక్షం ల‌భిస్తుందది. అంతేకాకుండా లక్ష్మి గ‌వ్వ‌ల‌తో పాటుగా శంఖువును కూడా ఉంచితే ఇంకా మంచిది. ల‌క్ష్మీ గ‌వ్వ‌లు ఉన్న చోట సిరి సంప‌ద‌లు, సుఖ సంతోషాలు కలుగుతాయి. లక్ష్మి గవ్వలను ఇంట్లోని బీరువాల్లో, షెల్ఫ్‌ల‌లో, లాక‌ర్ల‌లో పెట్టుకుంటే చాలా మంచిది. మరి ముఖ్యంగా దీపావ‌ళి పండుగ రోజున ఈ గ‌వ్వ‌ల‌తో ఆట‌లు ఆడితే చాలా మంచిది. ల‌క్ష్మీ దేవి త‌నంత‌ట తానుగా వ‌చ్చి సిరి సంప‌ద‌ల‌ను ఇస్తుంది. శివుడి జ‌టాజూటంలో, నందీశ్వ‌రుడి మెడ‌లో కూడా ఈ గ‌వ్వ‌లు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ గ‌వ్వ‌ల‌ను ఆడుతూ ల‌క్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా ప్ర‌చారంలో ఉంది.

 

చిన్న పిల్ల‌ల‌కు మెడ‌లో లేదా మొల‌లో ఈ గ‌వ్వ‌ల‌ను క‌డితే దృష్టి దోషం క‌ల‌గ‌దు. దృష్టి దోషం లేకుండా ఉండాలంటే వాహ‌నాల‌కు కూడా లక్ష్మి గ‌వ్వ‌లు క‌ట్ట‌వ‌చ్చు. భ‌వ‌న నిర్మాణ స‌మ‌యంలో ఏదో ఒక ప్ర‌దేశంలో ఈ గ‌వ్వ‌లు క‌డితే దృష్టి దోషం రాదు. అదేవిధంగా ఇంటి నిర్మాణం అయిన త‌రువాత గృహ ప్ర‌వేశం చేసే స‌మ‌యంలో ఒక గుడ్డ‌లో ల‌క్ష్మీ గ‌వ్వ‌ల‌ను వేసి క‌ట్టి గుమ్మానికి క‌డితే ల‌క్ష్మీదేవిని కొత్త ఇంట్లోకి ఆహ్వానించిన‌ట్టు అవుతుంది. ఒక ప‌సుపు రంగు వ‌స్త్రంలో ఈ గ‌వ్వ‌ల‌ను క‌ట్టి పూజా మందిరంలో ఉంచి ల‌లితా స‌హ‌స్ర నామాలతో కుంకుమార్చ‌న చేస్తే ల‌క్ష్మీ దేవి క‌టాక్షం క‌లిగి ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డుతుంది. వ్యాపార‌స్తులు డ‌బ్బులు పెట్టే క్యాష్ కౌంట‌ర్ల‌లో డ‌బ్బుల‌కు త‌గిలేలా ఈ గ‌వ్వ‌ల‌ను చేయడం వల్ల మరింత ఆదాయం చేకూరుతుంది.

Related Articles

ట్రేండింగ్

Jagan Cheated Kapu Community: జగన్ కాపులకు చేసిన మోసాలు ఇవే.. రూ.10 వేల కోట్లు ఇస్తానని ఇంత మోసం చేశారా?

Jagan Cheated Kapu Community:  దగా.. మోసం.. వంచన ఇలా ఈ పేర్లన్నీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పర్యాయపదాలుగా వాడవచ్చు ఎంతో సౌమ్యడిగా అమాయకుడిగా నటించేటువంటి ఈయన ప్రతి ఆలోచనలో కూడా...
- Advertisement -
- Advertisement -