Nara Lokesh: అనంతపూర్ లో గాయాలపాలైన లోకేశ్.. పోలీసుల వల్లే అంటూ?

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో ప్రారంభించగా 45 రోజులపాటు చిత్తూరు జిల్లాలో పర్యటించినటువంటి లోకేష్ చిత్తూరు జిల్లాకు వీడ్కోలు పలుకుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అడుగు పెట్టారు. ఇలా 46వ రోజు పాదయాత్రలో భాగంగా ఈయన ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం చీకటిమానుపల్లిలోకి ప్రవేశించారు.

 

ఈ విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వీడ్కోలు పలుకుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి నారా లోకేష్ ప్రవేశించడంతో పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు కార్యకర్తలు అభిమానులు నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. ఇలా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు వారిని అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇలా అభిమానుల తాకిడి అధికంగా ఉండడంతో ఒకరినొకరు తోసుకోవడం వల్ల లోకేష్ తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.

 

ఈ క్రమంలోనే పోలీసుల వైఫల్యం కారణంగా లోకేష్ భుజాలకు మొత్తం గాయాలు అయ్యాయని సమాచారం. గాయాలు అయినప్పటికీ లోకేష్ తన పాదయాత్ర విరమించకుండా వచ్చారు. ఇక నేడు సాయంత్రం వైద్యులు తనని పరీక్షించునున్నట్టు తెలుస్తుంది.ఈ విధంగా లోకేష్ భుజాలకు గాయాలు కావడంతో ఆయన అభిమానులతో కలిసి సెల్ఫీ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడటంతో ఇతరుల సహాయంతో లోకేష్ సెల్ఫీలు తీస్తున్నారు.

 

ఇక లోకేష్ సెల్ఫీలు తీయడానికి కూడా వీలు కాకపోవడంతో సెల్ఫీల కోసం అభిమానులు పెద్ద ఎత్తున బారులు తీరారు. 45 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్నటువంటి లోకేష్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏకంగా 587 కిలోమీటర్ల దూరం పాదయాత్రను పూర్తి చేశారు.ఇక 46వ రోజులో భాగంగా ఈయన ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించి అనంతపురం జిల్లాలో తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -