Mokshagna: ఆ ఒక్క పని చేస్తే మోక్షజ్ఞ స్టార్ స్టేటస్ కు తిరుగులేదా?

Mokshagna: తారక రామారావు వారసత్వం నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు సక్సెస్ సాధించగా ఈ మధ్య కాలంలో నందమూరి హీరోలకు వరుసగా విజయాలు దక్కుతున్నాయి. నందమూరి హీరోల సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకుంటున్నాయి.కళ్యాణ్ రామ్ సినిమాలు సైతం నిర్మాతలకు నష్టాలను మిగల్చడం లేదు.అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి అతి త్వరలో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య కూడా స్పెషల్ రోల్ లో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

 

మోక్షజ్ఞకు జూనియర్ సపోర్ట్ ఉంటే కెరీర్ పరంగా ప్లస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా భాషతో సంబంధం లేకుండా ప్రశంసలు అందుకుంటున్నారు.కథల విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయాలు రైట్ అవుతుంటాయి.టెంపర్ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమా సక్సెస్ సాధిస్తూ తారక్ మార్కెట్ ను పెంచుతోంది.

మోక్షజ్ఞ పాన్ ఇండియా హీరో అయ్యే విషయంలో ఎన్టీఆర్ సపోర్ట్ ఉంటే కచ్చితంగా బాగుంటుందని కొంతమంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మోక్షజ్ఞ నందమూరి ఫ్యాన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ జనరేషన్ ఆడియన్స్ కు ఎలాంటి కథలు నచ్చుతాయో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. బాలయ్య లేదా మోక్షజ్ఞ కోరితే తన వంతు సహాయసహకారాలు అందించడానికి ఎన్టీఆర్ ముందువరసలో ఉంటారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -