Tea: వేడి టీతో ఇవి కలిపి అస్సలు తీసుకోకూడదు?

Tea: ప్రస్తుత కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారు వరకు టీ, కాఫీ లకు చాలామంది టీ, కాఫీలకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఉదయం లేగవగానే కాఫీ లేదా టీ తాగడం అలవాటు అయిపోయింది. దీంతో ఒక్కరోజు టీ కాఫీ లేకపోయినా కూడా ఆ రోజంతా ఏదో కోల్పోయినట్టుగా పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే టీ తాగడం వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో అనారోగ్య సమస్యలు కూడా అన్నే ఉన్నాయి. అతిగా టీని తాగడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. టీ లలో చాలా రకాల టీలు ఉన్నాయి. ఇకపోతే మనలో చాలామందికి టీ తో పాటు కొన్నిరకాల పదార్థాలు కలిపి తీసుకోవడం ఇష్టం.

టీతో పాటు బిస్కెట్, సమోసా, బ్రెడ్ లాంటివి కలిపి తీసుకుంటూ ఉంటారు. అయితే టీ తాగేటప్పుడు కొన్నింటిని కలిపి తీసుకోకూడదు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముఖ్యంగా టీ తాగేటప్పుడు శనగపిండితో తయారుచేసిన పావ్ బాజీని తీసుకోరాదు. ఎందుకంటే అది జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది. టీ, పావ్ బాజీ కలిపి తీసుకోవడం వల్ల ఈ రెండు అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే వస్తాయి. కాబట్టి ఈ రెండింటిని కలిపి తీసుకోకూడదు. అదేవిధంగా టీ, నిమ్మరసం కలిపి తీసుకుంటే అసిడిఫికేషన్ అలాగే కడుపు ఉబ్బరంగా మారుతుంది.

 

అలాగే ఖాళీ కడుపుతో లెమన్ టీ తాగడం వల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. అందుకే సిట్రస్ ఫుడ్‌ను టీతో కలిపి తీసుకోరాదు. ఇక టీ, పసుపు కూడా కలిపి తీసుకోరాదు. ఇలా చేస్తే కడుపులో గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ సమస్యలు బాధిస్తాయి. కొందరికి పచ్చి ఉల్లిపాయలు తినడం అలవాటు. అయితే, వాటిని చాయ్‌తో కలిపి తీసుకోవడం మంచిది కాదు. ఎప్పుడు అయిన ఏదైనా తీసుకోవాలి అనుకుంటే టీ తాగిన తర్వాత అరగంట వరకు చల్లని ఫుడ్ తీసుకోకపోవడమే మంచిది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -