Naga Babu: నాగబాబు షాకింగ్ ట్వీట్.. జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యేలా?

Naga Babu: తెలుగు సినీ ప్రేక్షకులకు మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు నాగబాబు. జబర్దస్త్ షో కి జెడ్జ్ వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నాగబాబు పేరు ఏదో ఒక విషయంలో మారుమోగుతూనే ఉంది. మరి ముఖ్యంగా రాజకీయం విషయంలో నాగబాబు పేరు హల్చల్ చేస్తూనే ఉంది. తరచూ షాకింగ్ కామెంట్స్ చేసి వార్తలు నిలుస్తున్నాడు మెగా బ్రదర్.

ఇది ఇలా ఉంటే తాజాగా నాగబాబు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్​సీపీ ఓటమిని పరోక్షంగా ప్రస్తావిస్తూ నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తెలుగు దేశం పార్టీ నేతలు మొదలుపెట్టిన వై నాట్ నినాదాన్ని నాగబాబు కూడా అందుకున్నారు. ఆయన చేసిన ట్వీట్​తో ఇప్పుడు జనసేన, వైసీపీల మధ్య వార్​ మొదలైంది. ఇంతకీ నాగబాబు ఏమని ట్వీట్ చేశారంటే.. వై నాట్ పులివెందుల అంటూ ట్వీట్ చేశారు నాగబాబు. అయితే నాగబాబు చేసిన ట్వీట్ వెనుక ఒక కారణం కూడా ఉంది. వైసీపీ అధినేత, సీఎం జగన్, పార్టీ నాయకులు చాన్నాళ్లుగా వై నాట్ 175 సీట్స్ అంటున్నారు.

 

అలాగే వై నాట్ కుప్పం అంటూ టీడీపీని ఎద్దేవా చేస్తున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై స్పందిస్తూ వైసీపీ నేతలు ఇలా సెటైర్లు వేశారు. అయితే ఇప్పుడు తాజాగా నాగబాబు కూడా వైసీపీని లక్ష్యంగా చేసుకొని వై నాట్ పులివెందుల అంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ మారింది. వై నాట్ పులివెందుల అంటూ పరోక్షంగా ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్​ను ప్రస్తావించారు. నాగబాబు ట్వీట్​కు వైసీపీ మద్దతుదారులు కూడా స్ట్రాంగ్​గా కౌంటర్ ఇస్తున్నారు. కుప్పం గురించి మీరు నోరు ఎత్తడం లేదంటే.. మనం చంద్రబాబుకు అమ్ముడుపోయామని మీ అభిమానులకు పరోక్షంగా చెబుతున్నట్లే కదా?అంటూ కొందరు వైసీపీ సానుభూతిపరులు కామెంట్స్ చేశారు. పులివెందుల కోసం పగటి కలలు మాని.. గాజువాక, భీమవరంలో వాస్తవ పరిస్థితులకు రండి అంటూ నాగబాబుకి రివర్స్ లో వైసీపీ మద్దతుదారులు కౌంటర్లు వేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -