Lord Shiva: శివుడికి ఆ అభిషేకం చేస్తే చాలు కోరిక నెరవేరినట్లే?

Lord Shiva: సాధారణంగా దేవుడిని ఎన్నో రకాల కోరికలు కోరుకుంటూ ఉంటాం. కోరిన కోరికలు తీర్చమని చెప్పి దేవుడిని వేడుకుంటూ ఉంటాం.. కొంతమంది కోరిన కోరికలు వేసుకోవడం కోసం దానధర్మాలు, ప్రదక్షిణలు, పూజలు, వ్రతాలు, నోములు, అభిషేకాలు ఇలా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. అయితే కోరిన కోరికలు నెరవేరాలి అంటే శివుడికి అభిషేకం చేయాలి. మరి శివుడికి వేటితో అభిషేకం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శివుడు అభిషేక ప్రియుడు అని పిలుస్తూ ఉంటారు.

శివుడికి మనం కోరికలు నెరవేరడానికి ఒక్కో ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కో ఫలితాన్ని ఇస్తాయి. మరి ఏ ఏ ద్రవ్యాలతో పూజ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పరమేశ్వరుడికి ఆవుపాలతో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే పరిశుద్ధమైన జలంతో అభిషేకం చేస్తే నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. ఆవు నేతితో విశేషం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.
అలాగే గందోధకంతో అభిషేకం చేస్తే సంతాన ప్రాప్తి సౌఖ్యం కలుగుతుంది. అలాగే శివుడికి భస్మాభిషేకం చేస్తే పాపాలు అన్ని నశించిపోతాయి.

 

తేజస్సు యశస్సు లభించాలంటే శివుడికి తేనెతో అభిషేకం చేయాలి. భూ లాభం పొందాలి అంటే పరమేశ్వరుడికి పుష్పాలతో అభిషేకం చేయాలి. కొబ్బరినీళ్ళతో అభిషేకం చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. మారేడు పువ్వులతో అభిషేకం చేయడం వల్ల భోగభాగ్యాలు కలుగుతాయి. చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల ధనవృద్ధి కలుగుతుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల అపమృత్యు దోష నివారణ, శనిశాంతి కలుగును. అదేవిధంగా పసుపు, కుంకుమలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల శుభాలు కలుగుతాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -