Manchu Family: మంచు ఫ్యామిలీ పరువు గంగపాలు.. విష్ణు తప్పు చేశాడంటూ?

Manchu Family: మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నాయని గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇలా విష్ణు మనోజ్ మధ్య పలు విషయాల కారణంగా వివాదాలు చోటు చేసుకున్నాయంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలకు తెరపడింది.ఇద్దరి మధ్య గత కొంతకాలంగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయని తాజాగా విష్ణు చేసిన పని కారణంగా తేటతెల్లమయింది. మంచు ఫ్యామిలీకి ఎంతో నమ్మకంగా సారధి అనే వ్యక్తి కథ కొంతకాలంగా పనిచేస్తూ ఉన్నారు.

అయితే సారధి గత మూడు సంవత్సరాలుగా విష్ణు వద్ద నుంచి బయటకు వచ్చి మనోజ్ వద్ద పనిచేస్తున్నారు. ఇలా మనోజ్ వద్ద సారథి సన్నిహితంగా ఉండడంతో విష్ణు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా ఈయన ఏకంగా సారథి ఇంటికి వెళ్లి సారధితో గొడవ పెట్టుకున్నారు. ఇక మనోజ్ కూడా అక్కడే ఉండడంతో విష్ణు మనోజ్ ను కూడా కొట్టబోయారు. ఇక సారధి పై విష్ణు దాడి చేయడంతో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారని తెలుస్తోంది.

ఇలా విష్ణు తనపై దాడి చేయడంతో భయంతో సారధి ఇంటి నుంచి బయటకు పరుగులు పెడుతూ బయట తలుపుకు గడియ పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లోపల విష్ణు మనోజ్ పై దాడి చేయడానికి ప్రయత్నించగా సారధి కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు.ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోని మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఇలా తరుచు తన బంధువుల ఇంటికి వచ్చి కూడా కొడుతుంటారు ఇది సిచువేషన్ అంటూ వీడియోని షేర్ చేశారు అయితే ఈ వీడియో వైరల్ గా మారడంతో మోహన్ బాబు సీరియస్ అయినట్లు తెలుస్తుంది.

ఇక ఈ వీడియో పై మోహన్ బాబు మనోజ్ తో మాట్లాడి సర్ది చెప్పగా వెంటనే మనోజ్ ఈ వీడియోని డిలీట్ చేశారు. అయితే అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇకపోతే ఈ వీడియోని షేర్ చేయడంతో మంచు కుటుంబం పరువు మొత్తం గంగ పాలు అయిందని విష్ణు అలా ఆవేశపడకుండా ఉంటే బాగుండేది అంటూ పలువురు ఈ వీడియో పై అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -