Joint Pains: కీళ్ల నొప్పులా.. ఈ ఆహారం అస్సలు తినకండి?

Joint Pains: ప్రస్తుత రోజుల్లో ఉరుకుల, పరుగుల జీవితంలో అలసట ఆందోళనలు సర్వసాధారణమైపోయాయి. చాలామంది రోజంతా కష్టపడి పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది ఈ నొప్పులతో బాధపడుతున్నారు. అయితే నొప్పులు తగ్గాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి ఎటువంటి ఆహారాలు తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే కీళ్ళ సమస్యలలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా ఆర్థటైటిస్ సమస్యలు ఉన్నాయి..వాటిలో ముఖ్యంగా ఆస్టియో, రుమటాయిడ్‌, యాంకైలోజింగ్‌ స్పాండైల్‌, గౌట్, జువెనైల్‌ ఇడియోఫథిక్‌ ఆర్థరైటిస్‌, లూపస్, సోరియాటిక్‌ ఆర్థరైటిస్‌ లాంటి సమస్యలు ఉన్నాయి. కాగా ఒక సర్వే లో ముఖ్యంగా పురుషుల కంటే స్త్రీలే ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తున్నట్లు తేలింది. మరి ఈ సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని ఆహార నియమాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

నొప్పులు సమస్యలతో బాధపడేవారు స్వీట్లు తినకూడదు. స్వీట్ లు తినడం వల్ల ఆ నొప్పుల సమస్యలు ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. నొప్పులు ఉన్నవారు ఆలూ కూడా తీసుకోకూడదు. ఆలూ తినడం వల్ల కీళ్లలో నొప్పి, వాపు ఇంకా పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే కీళ్ళ నొప్పులు ఉన్నవారు పాలు తీసుకోకూడదు. అలాగే రెడ్ మీట్ కూడా తీసుకోరాదు. ఇది తింటే కీళ్ల వాపు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఆల్కహాల్, స్మోకింగ్ కు దూరంగా ఉండాలి. బ్రౌన్ రైస్, క్వినోవా, తృణ ధాన్యాలు తినడం మంచిది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -