Bangalore: వివాహేతర బంధాన్ని బయటపెట్టిన కారు?

Bangalore: రోజు రోజుకి సమాజంలో వివాహేతర సంబంధాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వివాహేతర సంబంధాల మోజులో పడి భార్యాభర్తలు వారి చక్కటి కాపురాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇంకొందరు అయితే ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషులు కట్టుకున్న భార్యని హత్య చేస్తున్నారు. అలాగే కొందరు మహిళలు తాళి కట్టిన భర్తను కాదనుకొని వారిని చంపి ఇతర పురుషులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నారు.

 

ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకి చెందిన వ్యక్తి ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2014లో అతనికి పెళ్లి అయ్యింది. ఆ దంపతులకు ఆరేళ్ళ పాప కూడా ఉంది. అయితే అతను రాత్రి పూట డ్యూటీ చేస్తుంటాడు. అతని భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అదే విషయాన్ని భర్త జిపిఎస్ ద్వారా తెలుసుకున్నాడు. అయితే భర్తకు తెలియనంత వరకు ఆమె కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత ఆమె అసలు నిజస్వరూపం బయటపడింది. కాగా అతను 2020లో కారు కొన్నాడు.

ఆ కారు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంతో వచ్చిన విషయాన్ని తన భార్య సహా ఎవరికీ చెప్పలేదు. అయితే ఒకరోజు అతను డ్యూటీలో ఉండగా రాత్రి పూట తన కారుని ఎవరో ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారని,జీపీఎస్ లో కారు వేగంగా వెళ్తున్నట్లు కనిపించిందని,ఒక హోటల్ దగ్గర ఆగిందని భర్త గుర్తించాడు. అర్ధరాత్రి వెళ్లిన కారు మళ్ళీ ఉదయం 5 గంటలకు ఇంటికి చేరుకుందని అతను తెలుసుకున్నాడు. మరోసారి తన కారు ఇలానే డ్యూటీలో ఉండగా అర్ధరాత్రి సమయంలో మళ్ళీ అదే హోటల్ దగ్గర ఆగింది. విషయం తెలుసుకున్న భర్త హోటల్ కు వెళ్ళాడు. అక్కడ ఇద్దరి ఓటర్ ఐడీ కార్డుల మీద ఒకే గది బుక్ చేయబడిందని తెలుసుకున్నాడు. దాంతో భారీ వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అని తెలుసుకొని ఆమెపై ఆమె ప్రియుడిపై మహాలక్ష్మి పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్థానికంగా కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయం తెలిసిన భార్య, ప్రియుడు ఇద్దరూ తనను బెదిరిస్తున్నారని వాపోయాడు. కోర్టు ఆదేశాల మేరకు భార్య, ప్రియుడిపై ఐపీసీ సెక్షన్ 417 కింద చీటింగ్ కేసు, సెక్షన్ 420 కింద చీటింగ్, నిజాయితీ లేకపోవడం, వస్తువుని తరలించడం కేసు, సెక్షన్ 506 కింద నేరపూరిత బెదిరింపు కేసు, సెక్షన్ 120బి కింద నేరపూరిత కుట్ర కేసులు నమోదు చేశారు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -