Thaman: గేమ్‌ ఛేంజర్‌` టైటిల్‌ బీజీఎం కూడా కాపీనే.. థమన్ కు బుద్ధుందా?

Thaman: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో ఎస్ఎస్ థమన్ ఒకరు.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో గుర్తింపు పొందిన ఈయన సుమారు అర డజనకు పైగా సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో తమన్ సంగీత సారథ్యంలో వచ్చిన సినిమాలన్నీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంటున్నాయి. థమన్‌ బీజీఎంకి మారుపేరుగా నిలుస్తున్నారు. ఆయన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కొట్టారంటే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే అని చెప్పాలి.

 

ఇలా ఈయన అఖండ వీరసింహారెడ్డి సినిమాలకు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి లేకపోతే తాజాగా ఈయన శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. ఇక రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు గేమ్ చేంజర్ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు వెల్లడించారు.

ఇక చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ కి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే ఎప్పటిలాగే థమన్‌పై ట్రోలర్స్ కూడా రెచ్చిపోతున్నారు. `గేమ్‌ ఛేంజర్‌` బీజీఎంలోనూ మిస్టేక్స్ వెతుకుతున్నారు. సాధారణంగా ఈయన ఏ సినిమాకు సంగీతం అందించిన కాఫీ ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు.

 

ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్‌ సినిమాలో బీజీఎం కూడా ఓ హిందీ ఒరిజినల్‌ సాంగ్‌కి కాపీ అని స్టార్ట్ చేశాడు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా షేర్ చేశారు. బాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ యోయో హనీ సింగ్‌, ఊర్వసి రౌతేలా కలిసి చేసిన `లవ్‌ డోస్‌`(టూ ఆజ్‌ మెరీ క్లోజ్‌) సాంగ్‌ని పోలి ఉందంటున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై తమన్ మరోసారి కాఫీ ట్రోల్స్ ఎదుర్కొంటూ నెట్టిజన్ల ట్రోల్లింగ్ కి గురవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -