Devotional: ఈ నియమాలు పాటిస్తే చాలు.. పూజలు రెట్టింపు ఫలితం?

Devotional: భారతదేశంలో హిందువులు ఎంతో మంది దేవుళ్లను పూజించడంతోపాటు ఎన్నో రకాల హిందూ సంప్రదాయాలను ఆచారాలను పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అందులో దేవుడు పూజ అన్నది మొదటిగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. కొంతమంది వారానికి నాలుగు లేదా ఐదు రోజులు మరెన్నో పూజలు చేస్తూ ఉంటారు. కొన్ని మాసాలలో నెల అంతా పూజ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా పూజ చేస్తూ ఉంటారు.

వారానికి ఒకసారి తమ కుల దైవానికి పూజ చేయడం కోసం పూజ గదిని శుభ్రం చేసి కలశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. పూజలు చేసేటప్పుడు కోరిన కోరికలు నెరవేర్చమని దేవుడిని వేడుకుంటూ ఉంటాం. అయితే మనం పూజ చేసిన దానికి రెట్టింపు ఫలితం దక్కాలి అంటే కొన్ని నియమాలను తప్పని సరిగా పాటించాలి. మరి ఎటువంటి నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనం పూజ చేసే ముందు రోజే పూజ గదిని శుభ్రం చేసుకుని పువ్వులు, అక్షింతలను కూడా రెడీ చేసుకోవాలి.

 

ముందు రోజే దేవుడి ఫోటోలను కూడా నీటిగా తుడిచి బొట్లు పెట్టుకోవాలి. అలాగే శివుడికి విభూతితో, శ్రీహరికి గంధంతో బొట్టు పెట్టడం మంచిది. చాలామంది చేసే అతిపెద్ద పొరపాటల్లో నైవేద్యాన్ని స్టీల్ ప్లేట్లలో పెడుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. నైవేద్యాన్ని ఎప్పుడు వెండి గిన్నెల్లో పెట్టాలి. ఒకవేళ వెండి గిన్నెలు లేకపోతే తమలపాకులో పెట్టడం మంచిది. అలాగే నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇచ్చి దాని చుట్టూ నీటి చుక్కలు చల్లి అప్పుడు హారతి తీసుకుంటే మంచి ఫలితం దక్కుతుంది. ఆ తర్వాత రెండు నిముషాలు దేవుడి గది నుండి బయటకు వెళ్లి నైవేద్యాన్ని స్వీకరించాలి. అలాగే చాలామంది ముందుగా దీపాల్లో ఒత్తులు వేసి ఆ తర్వాత నూనె పోసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ముందే దీపంలో నూనె పోసి ఆ తర్వాత ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ నియమాలను పాటించడం వల్ల పూజ చేసిన ఫలితంతో పాటు రెట్టింపు ఫలితం దక్కుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -