Lifestyle: అమ్మాయిలు ఈ తప్పులు చేశారంటే మాత్రం ప్రాణాలకే ప్రమాదమా?

Lifestyle: సాధారణంగా అమ్మాయిలలో యుక్త వయసు రాగానే అంటే 11 లేదా 12 సంవత్సరాల వయసులోకి రాగానే అమ్మాయిలు మెచ్యూర్ అవడం వారిలో పీరియడ్స్ రావడం మొదలవుతాయి. ఇలా దాదాపు 45 సంవత్సరాల వరకు ప్రతినెల పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ విధంగా ప్రతినెల క్రమం తప్పకుండా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. మరికొందరిలో మాత్రం నెలసరి అనేది సరిగా రాదు. ఇలా పీరియడ్స్ టైం కి రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మరి ఆ కారణాలు ఏంటి? ఎందుకు పీరియడ్స్ ఆలస్యంగా వస్తూ ఉంటాయి అనే విషయానికి వస్తే…

మెచ్యూర్ అయిన తర్వాత పిల్లలలో అప్పుడప్పుడే లోపల శరీర భాగాలఎదుగుదల జరుగుతూ ఉంటుంది కనుక 11 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వారిలో సరైన స్థాయిలో హార్మోన్లు విడుదల కాకపోవటం వల్ల పీరియడ్స్ అనేవి సక్రమంగా రావు అయితే ఇలాంటి పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల పెద్దగా సమస్య కూడా ఉండదు. ఇది సర్వసాధారణంగా జరిగే విషయమే. అలాకాకుండా 18 సంవత్సరాల నుంచి పెళ్లయిన వారందరిలో కూడా ఇలా నెలసరి మిస్ అవుతూ ఉంటుంది.

 

పెళ్లయిన మహిళలలో పీరియడ్స్ సక్రమంగా రాకపోతే ముందుగా వారు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్న తర్వాత డాక్టర్ వద్దకు వెళ్లి ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చినా కూడా పీరియడ్స్ రావడం లేదు అని చెబుతూ ఉంటారు. అయితే ఇలా పీరియడ్స్ ఇర్ రెగ్యులర్గా రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మన శరీర బరువు అధికంగా ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ మిస్ అవుతూ ఉంటాయి. అలాగే మరికొందరిలో పిసిఒడి, పైబ్రాయిడ్ వంటి సమస్యలు ఉన్నవారిలో కూడా ఇలా నెలసరి క్రమంగా రాదు.

 

ఇక మరికొందరిలో గర్భాశయంలో గడ్డలు అనేవి ఏర్పడి ఉంటాయి. ఇలాంటి గడ్డలు కొన్నిసార్లు క్యాన్సర్ కి కూడా ప్రమాదం కావచ్చు మరి కొన్నిసార్లు సాధారణమైన గడ్డలు కూడా కావచ్చు. అదేవిధంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు కూడా నెలసరి అనేది క్రమంగా రాదు. ఇక 40 సంవత్సరాలు పైబడిన వారిలో కూడా పీరియడ్స్ సరిగా రాకపోవడం ఒకవేళ వచ్చిన హెవీ బ్లీడింగ్ అవ్వడం ఎక్కువ రోజులు పాటు బ్లీడింగ్ అవ్వడం వంటివి జరుగుతుంటాయి ఇలాంటి సమస్యలు కనుక వస్తే తప్పనిసరిగా మీలో ఏదో సమస్య ఉందని అర్థం ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎవరు కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -