Back Pain: బ్యాక్ పెయిన్ సమస్యనా.. అయితే ఇలా చేయండి?

Back Pain: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఎలక్ట్రిక్ వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు గంటల తరబడి రోజుల్లో చాలా గంటలు ఆ ఎలక్ట్రానిక్ వస్తువులతోనే కాలక్షేపం చేస్తున్నారు.. అయితే గంటల తరబడి ఆ ఎలక్ట్రికల్ వస్తువుల వైపు అలాగే చూస్తూ ఉండడం, ఎక్కువసేపు ఎలక్ట్రిక్ వస్తువుల ముందు అలాగే కూర్చుని ఉండడం వల్ల వెన్ను నొప్పి నడుము నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలతోబాధపడుతున్నారు.

అలాగే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకొద్దిసేపు సిస్టం ముందు కూర్చుని పని చేసే వాళ్ళు కూడా ఈ బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడుతున్నారు. గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చుని పని చేయడం వల్ల బ్యాక్ పెయిన్ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. మజిల్స్ స్ట్రెచ్ అవడం వల్ల తీవ్రమైన నొప్పిని అనుభవిస్తుంటారు. ఫలితంగా ఏ పనీ చేయలేని పరిస్థితి. అటువంటి సమయంలో బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒకవేళ మీకు బ్యాక్ పెయిన్ లేదా మజిల్స్ స్ట్రెచ్ సమస్య ఉంటే మాలిష్ మంచి ఫలితాలను ఇస్తుంది.

 

ఏ భాగంలో అయితే నొప్పి ఉంటుందో ఆ భాగంపై నూనె రాసి చేత్తో మర్దనా చేయించుకోవాలి. దీనివల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది. మజిల్స్ స్ట్రెచ్ , నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు స్ట్రెచింగ్ మంచి ప్రత్యామ్నాయం. ఇలా చేయడం వల్ల మజిల్స్, లిగమెంట్స్, టేండన్‌లో నొప్పి సమస్యలు దూరమౌతాయి. మజిల్స్ పెయిన్, స్ట్రెచ్ సమస్యకు హాట్ అండ్ కోల్డ్ థెరపీ మెరుగైన ఫలితాలనిస్తుంది. నొప్పి నుంచి ఉపశమనం కల్గిస్తుంది. హాట్ థెరపీ ద్వారా మజిల్స్ రిలాక్స్ అవుతాయి. మజిల్స్ స్ట్రెచ్ లేదా బ్యాక్ పెయిన్‌కు మీరు ధరించే చెప్పులు కూడా కారణం. అలాగే ఎక్కువసేపు గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చోకుండా అప్పుడప్పుడు అర్థగంటకు ఒకసారి లేచి అలా తిరుగుతూ ఉండాలి. గంటల తరబడి మొబైల్ ఫోన్లు చూసేవారు మొబైల్ ఫోన్లను అవాయిడ్ చేయడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -