Maharashtra: పబ్లిక్ లో సర్పంచ్ దాడి చేసిన దుండగులు?

Maharashtra: రోజురోజుకీ మనుషుల్లో మానవత్వం మంట కలిసి పోతోంది. మనుషులు అన్న సంగతి కూడా మరిచిపోయి ఎదుటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా దారుణంగా పొడిచి చంపడం హత్య చేయడం లాంటివి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే నడిరోడ్డులో చంపడం అన్నది ఫ్యాషన్ అయిపోయింది. పగలు ప్రతికారాలు తీర్చుకోవడం కోసం నడిరోడ్డుపై చంపడం జైల్లో వెళ్ళి కూర్చోవడం. ఇలా చూసి చాలా మంది కుటుంబాలను వీధిన నిలబెడుతున్నాయి. తాజాగా ఒక వ్యక్తిని నడిరోడ్డుపై అత్యంత దారుణంగా పొడిచి చంపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర పూణే పరిధిలోని షిర్గావ్ గ్రామంలో ఒక వ్యక్తి సర్పంచ్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఏదో విషయంపై సర్పంచ్ పై కొందరు వ్యక్తులు పగతో ఊగిపోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా సర్పంచ్ ఊళ్లోని నడిరోడ్డుపై ఓ చోట స్కూటీపై కూర్చుని స్థానికులతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు యువకులు బైక్ పై సర్పంచ్ ఉన్నచోటుకు వచ్చారు. ఇక వస్తు వస్తూనే ఆ దండుగులు బైక్ దిగి సర్పంచ్ ను కత్తులతో నరికారు. అతడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా వదలని ఆ దుండగులు పరుగెత్తించి పరుగెత్తించి రోడ్డుపై అందరూ చూస్తుండగానే పబ్లిక్ లో నరికి చంపారు. ఈ ఘటనతో స్థానికులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే కొందరు వ్యక్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

 

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సర్పంచ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే సర్పంచ్ పై దాడి చేస్తున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. హత్య చేసిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -