Poorna: పూర్ణ కొడుకు భలే క్యూట్ ఉన్నాడుగా.. ఏం జరిగిందంటే?

Poorna: వెండితెర నటిగా తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పూర్ణ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.గత ఏడాది జూన్ నెలలో దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడిన పూర్ణ పెళ్లయిన కొద్ది నెలలకే తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక ఈమె గర్భం దాల్చడంతో పూర్తిగా సినిమాలకు బుల్లితెర కార్యక్రమాలకు దూరం అయ్యారు.

ఈ విధంగా బుల్లితెరకు వెండితెరకు దూరమైనటువంటి పూర్ణ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకునేవారు. ఈ క్రమంలోనే తన బేబీ బంప్ ఫోటోలతో పాటు సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇలా బేబీ బంప్ తో ఉన్నటువంటి పూర్ణ తాజాగా బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తుంది.

 

ఈమె మంగళవారం మధ్యాహ్నం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయినట్లు స్వయంగా పూర్ణ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.తన కుమారుడినీ ఎత్తుకొని ఉన్నటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసారు. అలాగే తనకు డెలివరీ చేసిన డాక్టర్లతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విధంగా పూర్ణ మగ బిడ్డకు జన్మనిచ్చారనే విషయం తెలియగానే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇలా పూర్ణ షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసిన నేటిజన్స్ సెలబ్రిటీలు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా పెళ్లి తర్వాత కొంతకాలం పాటు బుల్లితెరకు వెండితెరకు దూరంగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం బాబు పుట్టిన తర్వాత మరి కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటారని, ఈమెను వెండితెర ప్రేక్షకులు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో మిస్ అవుతున్నారనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -