Relationship: డెలివరీ తర్వాత కలయికలో సందేహాలా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Relationship: భార్య భర్తల మధ్య శృంగారం అన్నది ఎంతో కీలకమైనది. ఆలుమగల బంధానికి శృంగారం తొలిమెట్టు అని చెప్పవచ్చు. భార్య భర్తల మధ్య శృంగారం వారి మధ్య ఉన్న అన్యోన్యతను బంధాన్ని మరింత బలపరుస్తుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో భార్య భర్తల మధ్య ఎడబాటు తప్పదు అన్న విషయం తెలిసిందే. కానీ చాలామంది భాగస్వామి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా కలిస్తూ ఉంటారు. స్త్రీ ఆరోగ్యం బాగుంటే 8వ నెల వరకు శృంగారంలో పాల్గొనవచ్చు. అయితే కొందరు గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని నెలల వరకు కలిస్తే ఇంకొందరు గర్భవతి అని తెలియగానే వీడినంత దూరంగా ఉంటారు.

 

అయితే చాలామంది పురుషులకు భార్య డెలివరీ తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. డెలివరీ తర్వాత వెంటనే కలవచ్చా లేదంటే గ్యాప్ తీసుకోవాలా గ్యాప్ తీసుకుంటే ఎన్ని రోజుల తర్వాత కలవాలి ఇలాంటి అనేక సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. చాలామంది పురుషులకు ఈ విషయంలో స్పష్టత ఉండదు. కానీ కొందరు డెలివరీ తర్వాత ఆరు నెలల వరకు సెక్స్ లో పాల్గొనకూడదు అని చెబుతూ ఉంటారు. అయితే అది నిజం కాదు అంటున్నారు నిపుణులు. డెలివరీ అనంతరం ఆరు వారాల తర్వాత భార్యాభర్తలు వారి సెక్స్ జీవితాన్ని తిరిగి ఆనందంగా ప్రారంభించవచ్చు. అయితే కొందరికి సిజేరియన్లు కావడం వల్ల కొద్దికాలం పాటు కుట్లు పచ్చిగా ఉంటాయి.

 

అవి పూర్తిగా మానికపోకముందే సెక్స్ లో పాల్గొంటే నొప్పి మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరు వారాల తర్వాత మీ డాక్టర్ ని సంప్రదించి ఆ తర్వాత సెక్స్ లో పాల్గొనడం మంచిది. ఆ తర్వాత మీ ఆనందకర జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టవచ్చు. నొప్పి ఉన్న భావన కలిగితే మరి కొద్ది రోజులు ఆగి ప్రయత్నించవచ్చు. కేవలం 6 వారాలు మాత్రమే కాకుండా అంతకంటే తక్కువ అంతకంటే ఎక్కువ సమయం లో కలవాలి అనుకున్నప్పుడు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యున్ను సంప్రదించడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -