IPL: అశ్విన్‌ను ఓపెనర్‌గా అందుకే పంపారట.. క్లారిటీ ఇదిగో

IPL: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో బుధవారం రాజస్థాన్ రాయల్స్ తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ లోనూ రాజస్థాన్ రాయల్స్ నిరాశపర్చింది. దీంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెండో విజయాన్ని తన ఘాతాలో వేసుకుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ అశ్విన్‌ను ఓపెనర్ గా బరిలోకి దింపింది. లాస్ట్ లో బ్యాటింగ్‌కు వచ్చే అశ్విన్ ఓపెనర్ గా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ క్లారిటీ ఇచ్చాడు.

మధ్య ఓవర్లలో లెఫ్టార్మ్ బ్యాట్స్‌మెన్ అవసరం కావడం వల్ల అశ్విన్ ను ఓపెనర్‌గా పంపినట్లు సంజూ శాంసన్ స్పష్టం చేశాడు. పంజాబ్ జట్టులో లెప్టార్మ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్, లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ ఉన్నాడని తమకు తెలుసని, వాళ్లు మధ్య ఓవర్లలో బౌలింగ్ వేస్తారని మాకు తెలుసన్నాడు. మధ్య ఓవర్లలో లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్ ఉండటం తమకు ముఖ్యం అనిపించిందని, అందుకే ఓపెనర్ యశస్వి జైస్వాల్ తో కలిపి అశ్విన్ ను మరో ఓపెనర్ గా పంపినట్లు సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.

 

దేవదత్ పడిక్కల్‌కు ఓపెనర్‌గా అనుభవం ఉందని, కానీ లెఫ్టార్మ్ స్పినర్ విషయంలో పడిక్కల్ ను నాలుగో స్థానంలో పంపినట్లు తెలిపాడు. అయితే తాము అనుకున్న ప్రయోగం ఫలించలేదని సంజూ శాంసన్ తెలిపాడు. మాములుగా అయితే బట్లర్, యసస్వి జైస్వాల్ ఓపెనర్ గా రావాల్సి ఉంది. కాని ఫీల్డింగ్ సమయంలో బట్లర్ చేతికి గాయమైంది. వేలికి స్టిచ్ వేయాల్సి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింట్ చేయాల్సిన సమయానికి బట్లర్ పూర్తిగా ఫిట్ గా లేడు. దీంతో బట్లర్ స్థానంలో అశ్విన్ ను బ్యాటింగ్ కు పంపారు.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -