Celebrities: ఇండస్ట్రీలో కొనసాగుతూ… రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సెలబ్రిటీస్ వెళ్లే!

Celebrities: హైదరాబాద్ మహానగరానికి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఈ నగరాన్ని నిజం రాజుల పరిపాలించారనే గొప్ప చరిత్ర మాత్రమే కాకుండా ఇక్కడ రుచికరమైన వంటలకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందినది అందుకే ఎక్కువమంది రెస్టారెంట్ బిజినెస్ రాణిస్తున్నారు.అయితే ఇండస్ట్రీకి చెందినటువంటి ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టి ఎంతో మంచిగా వారి వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మరి ఇండస్ట్రీలో కొనసాగుతూ రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన స్టార్స్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..

శర్వానంద్- బీంజ్ కాఫీ షాప్: హీరో శర్వానంద్ ఇండస్ట్రీలో రాణిస్తూనే ఈయన బీంజ్ కాఫీ షాప్ రెస్టారెంట్ కలిగి ఉన్నారు ఇక్కడ అరటికాయ బజ్జీలు పునుగులు మిర్చి బజ్జి వంటి స్నాక్స్ ఎంతో స్పెషల్.

సురేందర్ రెడ్డి: టాలీవుడ్ డైరెక్టర్ గా ఇంత పేరు సంపాదించుకున్న సురేందర్ రెడ్డి ఉలవచారు ఫ్రాంచైజీ దక్షిణ భారత వంటకాలను భోజన ప్రియులకు అందిస్తున్నారు. ఇక ఈ రెస్టారెంట్స్ జూబ్లీహిల్స్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలతో పాటు హైదరాబాదులో పలు ప్రదేశాలలో ఉన్నాయి.

శశాంక్: నటుడు శశాంక్ మాయాబజార్ అనే సినిమా నేపథ్యంలో ఓ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. ఇది సికింద్రాబాద్లోని కార్జానాలో ఉంది. రుచికరమైన మొగలాయిల వంటకాలు ఇక్కడ ప్రత్యేకం.

మహేష్ బాబు నమ్రత: ఇప్పటికీ ఎన్నో బిజినెస్ లను నిర్వహిస్తున్నటువంటి మహేష్ బాబు తాజాగా ఏషియన్ వారితో కలిసి రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ రెస్టారెంట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇది హైదరాబాదులో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంది.

ఆనంద్ దేవరకొండ: గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్ అనే రెస్టారెంట్ ప్రారంభించారు ఈ కేఫ్ ప్రశాంతమైన వాతావరణం, రుచికరమైన కాఫీ స్నాక్స్ కు ఎంతో ప్రసిద్ధి చెందినది.

రానా: జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి అభయారణ్యం రెస్టారెంట్ ఇటాలియన్ వంటకాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది కేవలం రెస్టారెంట్ మాత్రమే కాదు ఇది రానా చిన్నప్పటి ఇల్లు ఇందులో ఈయనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు కూడా దాగి ఉన్నాయి. తన చిన్ననాటి ఇంటిని ఇప్పుడు రెస్టారెంట్ గా నిర్వహిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -