Movies: పరిమిత బడ్జెట్ తో లాభాలను అందించిన ఈ సినిమాల గురించి తెలుసా?

Movies: సినిమా హిట్ అన్నది కథపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. పెద్ద బడ్జెట్, భారీ సెట్లు వేసి తీస్తేనే సినిమా హిట్ అనుకునే వారికి ఈ మధ్యకాలంలో వచ్చిన చిన్న సినిమాలు పాఠాన్ని నేర్పాయి. విడుదలైన మెుదటి వారంలోనే భారీ కలెక్షన్ చేసి, తమ సత్తాని భారీ బడ్జెట్ సినిమాలకు చూపించాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన కాంతారా మూవీ సంచలనం సృష్టిస్తోంది.తెలుగులో 2 కోట్లు పలికిన ఈ మూవీ ఇప్పటివరకు రూ.25 కోట్ల వరకు లాభాలను తీసుకువచ్చింది. డిస్టిబ్యూటర్లు ఈ మూవీ తీసుకోవటంతో తమ గత నష్టాలన్నీ తీర్చుకున్నట్లు తెలిసింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన రీసెంట్ సినిమా బింబిసార. ఈ మూవీ రూ. 15.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా దాదాపు రూ.40 కోట్ల షేర్ రాబట్టింది.

ఏ మాత్రం హోప్ లేకుండా వచ్చిన సినిమా కార్తీకేయ-2. ఎనర్జిటిక్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ వచ్చింది. ఈ సినిమా రూ. 12.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటివరకు రూ.58.40 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. మెగాస్టార్ మేనల్లుడుగా వచ్చిన వైష్ణవ్, తొలి సినిమా ఉప్పెనతో సంచలనం. ఈ మూవీ 20.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే, రూ. 31.02 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

సెలైంట్ అండ్ సింపులెస్ట్ దర్శకుడు శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 50 కోట్ల షేర్ సాధించింది. మొత్తంగా రూ. 30.5 కోట్ల లాభాలు తీసుకొచ్చాయి. జాతి రత్నాలు మూవీ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా రూ. 11 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది. ఓవరాల్ గా రూ.39 కోట్ల షేర్ రాబట్టింది. టోటల్ గా రూ. 27.52 కోట్ల లాభం తీసుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -