Balakrishna: అఖండ, వీరసింహారెడ్డి సినిమాలను మించి యాక్షన్ సీన్స్ ఉంటాయా?

Balakrishna: టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవల వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాది దసరా పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సెలవేయంగా జరుగుతోంది. ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో బంధిస్తున్నట్లు ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపిన విషయం తెలిసిందే.

ఇటీవలె ఈ సినిమాలో బాలయ్య బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. కాగా మామూలుగానే బాలయ్య బాబు సినిమాలో మాస్ డైలాగులు ఒక రేంజ్ లో ఉంటాయని చెప్పవచ్చు. దానికి తోడు తెలంగాణ యాస ఎప్పుడైతే ఇక అదుర్స్ అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ఏప్రిల్ 14న హైదరాబాదులో మొదలైంది. ఈ షెడ్యూల్లో ఈ సినిమాలోని ఒక హై వోల్టేజ్ యాక్షన్స్ సన్నివేశాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అందుకు సంబంధించి ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోలో ఫైట్ కోసం ఉస్ చేసే క్రేన్, రోప్స్ అండ్ సెట్ ప్రోపర్టీస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే హీరోయిన్ శ్రీలీల ఇందులో ఒక ప్రత్యేక పాత్రలో నటించనుంది. తాజాగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు సెట్స్ లోకి అడుగు పెట్టారు. ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో విడుదల కావడంతో ఆ వీడియోని చూసిన బాలయ్య బాబు తదుపరి సినిమా అఖండ, వీర సింహారెడ్డికి మించి ఉండబోతుందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -