NTR-Balayya: ఎన్టీఆర్ దెబ్బకు బాలయ్య సినిమా డిజాస్టర్.. ఏం జరిగిందంటే?

NTR-Balayya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో నందమూరి ఫ్యామిలీ ఒకటి.నందమూరి తారకరామారావు వారసురుగా ఇండస్ట్రీలోకి పలువురు ఎంట్రీ ఇచ్చినప్పటికీ బాలకృష్ణ మాత్రమే సక్సెస్ అయ్యారు. ఇక తరువాత ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఎదుగుదలను బాలయ్య ఓర్వలేక పోతున్నారంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ బాలయ్య ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తుంటాయి.

ఇక ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుంచి రెండు సినిమాలు ఎప్పుడు విడుదలైంది లేదు కానీఒకే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ ఎన్టీఆర్ నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో ఎన్టీఆర్ బాలయ్య సినిమాని ఘోరంగా దెబ్బ కొట్టారని తాజాగా డైరెక్టర్ శ్రీవాస్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. లక్ష్యం, లౌక్యం వంటి సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీవాస్ ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రామబాణం అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీవాస్ బాలకృష్ణ ఎన్టీఆర్ సినిమాల గురించి ప్రస్తావించారు. తాను బాలకృష్ణ హీరోగా డిక్టేటర్ సినిమాని చేశాను ఈ సినిమా మొత్తం రియాలిటీ గానే చేశానని ఈ సినిమాపై తమకు ఎన్నో అంచనాలు కూడా ఉన్నాయని తెలిపారు.

ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీ సోలోగా విడుదల కాబోతుందని భావించాము. అయితే ఉన్నఫలంగా సంక్రాంతి రేసులోకి ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదలైంది. ఇక ఈ సినిమా విడుదల కావడంతో ఈ సినిమా మంచి సక్సెస్ అందుకొని బాలయ్యకు ఫ్లాప్ సినిమాను అందించాయి.ఇలా ఎన్టీఆర్ సినిమా విడుదలైన కారణంగా బాలకృష్ణ డిక్టేటర్ డిజాస్టర్ అయిందని శ్రీ వాస్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chiranjeevi: చిరంజీవిపై విషం చిమ్మడం పాత్రికేయమా.. ఇది వ్యభిచారం కాదు వెబ్ చారమ్ అంటూ?

Chiranjeevi: ప్రస్తుత కాలంలో ఒక్కొక్క మీడియా సంస్థ ఒక్కొక్క రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకించి చానల్స్ పెట్టుకోవడం కూడా గమనార్హం. అయితే ఒక...
- Advertisement -
- Advertisement -