Tirumala: తిరుమలకు దర్శనానికి వెళ్లేవాళ్లకు శుభవార్త.. ఏం జరిగిందంటే?

Tirumala: మన భారత దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి. ఇలా ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. కలియుగ దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏడుకొండల పై కొలువై ఉన్నారు.ఇలా స్వామివారిని దర్శించి మనస్ఫూర్తిగా నమస్కరించిన యెడల కోరిన కోరికలు నెరవేర్చునని భక్తులు భావిస్తారు ఈ క్రమంలోనే దేశం నలుమూలనుంచి కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటారు.

ఇలా ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో భక్తుల స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్వామివారి దర్శనం కోసం వచ్చే వృద్ధులకు చిన్న పిల్లల తల్లులకు ఎంతో ఇబ్బందికరంగా మారింది అయితే ఈ విషయాలను దృష్టిలో ఉంచుకున్నటువంటి టీటీడీ వృద్ధుల ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది.మనం స్వామివారి దర్శనం కోసం టికెట్ బుక్ చేసుకునే సమయంలో 60 సంవత్సరాలు వయసు పైబడిన వారికి ప్రత్యేకంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

ఇలా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధుల కోసం ప్రత్యేకంగా క్యూ ఏర్పాటు చేసి స్వామివారి దర్శనం కల్పిస్తారు. కేవలం అరగంట, గంటలోపే వృద్ధులకు స్వామివారి దర్శనం కల్పించే దిశగా టీటీడీ చర్యలు చేపడుతుంది. ఈ సమయంలో ఇతర క్యూ లైన్ లను దర్శనం నిలిపివేసి వృద్ధులకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే ప్రసాదాలను తీసుకోవడం కోసం వృద్ధులకు ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

 

ఇలా టీటీడీ చేపడుతున్న ఈ చర్యల వల్ల ఇకపై వృద్ధుల స్వామివారిని దర్శించుకోవడం మరింత సులభతరం అవుతుంది.ఇక ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి సందేహాలు కనుక ఉంటే ఈ సందేహాలను నివృత్తి చేయడం కోసం టిటిడి సలహా నెంబర్08772277777 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి మీకున్నటువంటి సందేహాలను తీర్చుకోవచ్చు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -