Cricketer: ఆ క్రికెటర్ పై మండిపడుతున్న అభిమానులు.. వరస్ట్ అంటూ?

Cricketer: ఐపీఎల్ 2023 సన్ రైజెస్ హైదరాబాద్ కి మరో ఘోర పరాజయం ఎదురైంది. ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 14 పరుగుల తేడాతో సన్ రైజెస్ హైదరాబాద్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ముంబై ఇండియన్స్ 192 పరుగులకు 193 పరుగులతో సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలోకి తెగింది అయితే లక్ష్యాన్ని చేరుకోలేక 178 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండోర్ఫ్, మెరిడిత్‌, చావ్లా తలా రెండు వికెట్లు సాధించగా.. గ్రీన్‌, అర్జున్‌ టెండ్కూలర్‌ చెరో వికెట్‌ సాధించారు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో మయాంక్‌ అగర్వాల్‌(48) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్ హెచ్ చివరికి ఓటమిని అంగీకరించక తప్పలేదు.

 

ఆఖరి 5 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయానికి 60 పరుగులు కావాలి. ఈ సమయంలో సన్‌రైజర్స్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అబ్దుల్ సమద్ దారుణ ఆట తీరును కనబరిచారు. సమద్ 13 బంతులకు కాను కేవలం 9 పరుగులు చేశారు. ఇక ఆఖరి ఓవర్లో ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న సమయంలో అవసరంలేని పరుగుకు ప్రయత్నించడంతో ఈయన రన్ అవుట్ అయ్యారు. ఇలా ఈయన ఆట తీరుపై ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

 

ఎస్‌ఆర్‌హెచ్‌ ఇలా ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయం కావడానికి కారణం సమద్ అంటూ మండిపడుతున్నారు. ఇక ఈయన ఆట తీరు చూసినటువంటి పలువురు అభిమానులు తాను ఐపిఎల్ లో కాకుండా ఐపీఎల్ కు రిజైన్ చేసి ఏదైనా గల్లీలో పోయి ఆటలు ఆడుకో అంటూ పలువురు ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -