Rohith: అదుర్స్ అనిపించిన రోహిత్ సేన.. ఆ రికార్డ్ దక్కడంతో?

Rohith: ఉప్పల్ వేదికగా తాజాగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ చేతిలో ఘోరపరాజయ ఎదుర్కొంది 14 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది.

 


193 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 19.5 ఓవ‌ర్ల‌లో 178 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయి చివరికి ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది.

 

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ హోరాహోరీగా చివరి వరకు ఉత్కంఠ భరితంగా కొనసాగుతూ వచ్చింది. అంత‌క‌ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియ‌న్స్ కు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ, ఇషాన్ కిషన్ మంచి శుభారంభం ఇచ్చారు.
వాషింగ్ట‌న్ సుంద‌ర్ వేసిన మూడో ఓవ‌ర్‌లో రోహిత్ శ‌ర్మ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి ఐపీఎల్‌లో 6 వేల ప‌రుగులు పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించారు.

 

ఇలా రోహిత్ శర్మ తన ఆట తీరును కనబరుస్తున్న నేపథ్యంలో న‌ట‌రాజ‌న్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించిన రోహిత్‌.. మార్‌క్ర‌మ్ చేతికి చిక్కాడు. దీంతో ముంబై జ‌ట్టు 41 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఇషాన్ కిష‌న్‌కు కామెరూన్ గ్రీన్
జ‌త క‌లిశాడు. వీరిద్ద‌రు రెండో వికెట్‌కు 46 ప‌రుగులు జోడించారు. ఇలా ముంబై ఇండియన్స్ అద్భుతమైన ఆట తీరును కనబరుస్తున్న నేపథ్యంలో మార్కో జాన్సెన్ ముంబైను భారీగా దెబ్బతీశారు.

 

ఇషాన్ కిష‌న్‌తో పాటు సూర్య‌కుమార్‌ యాద‌వ్‌ను ఒకే ఓవర్ లోనే అవుట్ చేశారు. ఇలా 95 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయిన ముంబై ఇండియన్స్ కష్టాలలో పడగా గ్రీన్‌కు లోక‌ల్ బాయ్ తిల‌క్ వ‌ర్మ‌ తోడయ్యారు. తిలక్ వర్మ దూకుడు ప్రదర్శన కనిపించారు కేవలం 17 బంతులలో రెండు ఫోర్లు నాలుగు సిక్సులు కొట్టారు. కామెరూన్ గ్రీన్‌ 33 బంతుల్లోనే ఐపీఎల్‌లో తొలి అర్ధ‌శ‌త‌కాన్ని సాధించాడు. గ్రీన్ విజృంభ‌ణ కార‌ణంగా ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -