Sin: ఈ పాపం చేస్తే దేవుడి దయ మనపై ఉండదా.. ఏం జరిగిందంటే?

Sin: సాధారణంగా మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటాము అయితే మనం చేసిన తప్పులకు,పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం మనకి ఉంటే తప్పనిసరిగా ఆ పొరపాట్లు ఇంకొకసారి పునరావృతం కాకుండా ఆ తప్పులు మరొకసారి చేయకుండా జాగ్రత్త పడాలి.అయితే కొంతమంది చేసిన పాపం పనుల నుంచి విముక్తి పొందడం కోసం ఎన్నో రకాల పూజలు యాగాలు చేస్తూ ఉంటారు.

మనం చిన్నప్పటి నుంచి ఒక సామెత చదువుకుంటూ ఉంటాం తల్లిని మించిన దైవం లేదు అని. ముందు మనం మన తల్లిదండ్రులను గౌరవించాలని చెబుతుంటారు. అయితే తల్లికి భూదేవి అంత సహనం ఉంటుంది. తన బిడ్డలు ఎలాంటి తప్పులు చేసిన క్షమించే గుణం ఆమెకు ఉంటుంది .అయితే తల్లిని ఏ బిడ్డ అయితే కష్టపడతారో తనని నిందిస్తారో అలాంటి వారికి చాలా పాపం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

 

తల్లి చెడు దారిలో నడుస్తున్న ఆమెను నిందించిన అది పాపమేనని, కన్నతల్లి చేత కంటనీరు పెట్టించిన అది ఎన్నియాగాలు చేసిన తొలగిపోని పాపమని పండితులు చెబుతున్నారు అందుకే కన్నతల్లి కంటనీరు రాకుండా చూసుకోవాలి. ఇలా కన్నతల్లిని కనుక బాధపెట్టి తనని ఇబ్బందులకు గురిచేస్తే అంతకన్నా మహా పాపం లేదని ఈ పాపానికి విమోచన లేదని చెప్పాలి. ఇలా తల్లిని నిందించిన పాపం లక్ష గోవులు దానం ఇచ్చిన, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన కన్నతల్లిని నిందించిన పాపం తొలగిపోదు.

 

ఇలా కన్నతల్లిని నిందించిన వారు ఎవరు కూడా బాగుపడినట్లు చరిత్రలో లేవు అందుకే కన్నతల్లిని ఎప్పుడు బాధ పెట్టకుండా తనని మనకు చేతనైనంతలో సంతోషంగా ఉంచడం కోసమే ప్రయత్నం చేయాలి ఇలా కన్నతల్లిని బాధ పెట్టిన వారిపై ఆ భగవంతుడి కృప కూడా ఉండదు. అందుకే తల్లిని గౌరవించి తన పట్ల ఎంతో మంచిగా వ్యవహరించడం మంచిదనీ శాస్త్రాలు చెబుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -