Raavi Chettu: రావిచెట్టుకి ప్రదక్షిణలు చేస్తే కలిగే ఫలితాలు ఇవే?

Raavi Chettu: భారతదేశంలో హిందువులు కొన్ని రకాల చెట్లను దేవతలుగా భావించి పూజిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టును భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కోరిన కోరికలు నెరవేర్చడానికి సమస్యల నుంచి గట్టెక్కించడానికి రావి చెట్టు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రావి చెట్టుని విష్ణు స్వరూపంగా భావిస్తూ ఉంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కాగా ఈ రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు.

రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? అలాగే రావి చెట్టుని పూజించినప్పుడు ఎటువంటి విషయాలు గుర్తుంచుకోవాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రావి చెట్టుకు పూజ చేయాలనుకునేవారు సూర్యోదయం తర్వాత నదీస్నానం ఆచరించి కుంకుమధారణ చేసి రావి చెట్టును పూజించాలి. అయితే రావిచెట్టును పూజించే ముందుగా గణపతిని సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత రావి చెట్టుకు పూజ చేయాలి. అలాగే రావిచెట్టుకు ఏడుసార్లు అభిషేకం చేసి విష్ణు సహస్ర నామాలను చదువుతూ రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది.

 

రావి చెట్టును తాకుతూ ప్రదక్షిణలు చేయకుండా ప్రతి ప్రదక్షిణం అనంతరం నమస్కరిస్తూ ప్రదక్షణ చేయాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా తొందర తొందరగా ప్రదక్షిణలు చేయకూడదు. నెమ్మదిగా నిదానంగా రావి చెట్టుకి పూజలు చేయాలి. రావి చెట్టును ప్రతి రోజు కూడా పూజించవచ్చు. కానీ ఆదివారం మంగళవారం రోజు సంధ్యా సమయంలో ఈ చెట్టును తాకకూడదు. రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సంతాన సమస్యలతో బాధపడేవారు రావి చెట్టుకు తిరగడం వల్ల ప్రదక్షిణలు చేయడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది.

 

శనివారం మాత్రమే ఈ చెట్టును తాకి పూజ చేసిన అనంతరం మనలో ఉన్న కోరికలను తెలియజేయడంతో కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. రావి చెట్టు ను పూజించడం వల్ల శని దేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -