Relationship: వామ్మో.. హస్త ప్రయోగం చేయకపోతే అలాంటి సమస్యలు వస్తాయా?

Relationship: సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో యుక్త వయసు వచ్చిన తర్వాత సెక్స్ పై కోరికలు అధికమవుతుంటాయి. అందుకే యుక్త వయసు రాగానే పెళ్లిళ్లు చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టి వారి శృంగార జీవితాన్ని కూడా సంతోషంగా గడుపుతూ ఉంటారు.అయితే చాలామంది కొన్నిసార్లు శృంగార కోరికలు ఎక్కువ కావటం వల్ల హస్తప్రయోగం కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయని చాలా మంది భావిస్తూ ఉంటారు.

ఇకపోతే హస్తప్రయోగం చేసుకోకపోతే ఎన్నో సమస్యలు కూడా వస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా మగవారిలో హస్త ప్రయోగం చేసుకోకపోతే పలు సమస్యలు ఎదురవుతాయని తెలియజేస్తున్నారు. సెక్స్ లో పాల్గొన్న సమయంలో మగవారి శరీరం నుంచి వీర్యకణాలు బయటకు విడుదలవుతాయి. ఇలా వీర్యకణాలు బయటకు విడుదలైనప్పుడు వారిలో ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు.

 

ఇక శరీరంలో వీర్యకణాల ఉత్పత్తి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. మనం సెక్స్ లో పాల్గొనక పోయిన, హస్త ప్రయోగం చేసుకోకపోయినా ఆ వీర్యకణాలన్నీ అలాగే స్టోరేజ్ అయి ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలా ఇన్ఫెక్షన్ కారణంగా మనం మూత్రానికి వెళ్లిన చాలా మంటగా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే వీర్య కణాలని ఎప్పటికప్పుడు బయటకు పంపించడం వల్ల ఈ విధమైనటువంటి సమస్యలు ఉండవు.

 

పెళ్లి జరిగిన వారు శృంగారంలో పాల్గొనడం వల్ల వీర్య కణాలను బయటకు పంపించవచ్చు. అయితే కొంతమంది కొన్ని కారణాలవల్ల శృంగారంలో పాల్గొనలేక పోతుంటారు. అలాంటి వారు హస్త ప్రయోగం చేయడం వల్ల వీర్యకణాలను బయటకు పంపించవచ్చు. ఇలా చేయటం వల్ల పురుషులలో ఇన్ఫెక్షన్ అనేది సోకకుండా ఉంటుంది. ఇక చాలామందికి కలలో కూడా ఏదైనా శృంగారపు సంబంధించిన కలలు వస్తే ఈ వీర్యకణాలు బయటకు విడుదలవుతూ ఉంటాయి. అయితే ఇలా వీర్యం పడిపోయిందని తాను చాలా వీక్ అని ఎవరు కంగారు పడాల్సిన పనిలేదని, ఇది సర్వసాధారణంగా జరిగే అంశమేనని నిపుణులు వెల్లడించారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -