CM NTR: సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు.. బాలయ్య స్పందన ఇదే!

CM NTR: సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను విజయవాడలో ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇలా తారకరామారావు శత జయంతి వేడుకలలో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ఎన్టీఆర్ సినీ కెరియర్ గురించి ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున నందమూరి అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

 

తెలుగుదేశం పార్టీ సీఎంగా ఎవరు పడితే వారిని కానివ్వను అంటూ ఆయన తన స్టైల్ లో సమాధానం చెప్పారు. ఇలా అభిమానులు నినాదాలు చేస్తున్న తీరకు బాలయ్య సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్.టి.రామారావు నిజమైన వారసులుగా సీఎం అయ్యే యోగ్యత కేవలం జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే ఉందని ఇలా నందమూరి వారసులు కాకుండా నారా వారసులు సీఎం కావడం ఏంటి అని పలువురు ఈ విషయంపై ఎన్నోసార్లు విమర్శలు కురిపించారు.

 

ఇక ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉంది. పార్టీలో సరైన నాయకుడు లేకపోవడంతోఎన్టీఆర్ కనక రాజకీయాలలోకి వస్తే తప్పకుండా పార్టీకి తిరిగి పూర్వ వైభవం వస్తుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.ఈ క్రమంలోని ఎన్టీఆర్ ఏ కార్యక్రమానికి వెళ్లిన పెద్ద ఎత్తున సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో కూడా సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయడంతో బాలయ్య తనదైన స్టైల్ లో స్పందించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -