April Box Office: ఏప్రిల్ నెల బాక్సాఫీస్ పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా?

April Box Office: చిత్ర పరిశ్రమలో సినిమాల ప్లాప్ లు కొత్తేమీ కాదు. కానీ ఒకేసారి ఒకటి రెండుకన్నా పెద్ద సినిమాలు ఫెయిల్ అయితేనా చాలా కష్టం. గతేడాది ఇండస్ట్రీకి మెుగుడులా చెప్పుకునే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ చేశారు. చివరికీ తీవ్ర నిరాశ ఎదురైంది. అప్పుడు ఒక సినిమానే కదా అని సర్దుకున్నారు. ఈ సారి అదే సమయంలో ఏకంగా మూడు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.

ఏప్రిల్ మొదటి వారంలో రావణాసుర, మీటర్ సినిమాలొచ్చాయి. రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుశాంత్ కీలక పాత్రలో కనిపించడం, ఏకంగా ఐదుగురు హీరోయిన్లు మెరవడం, కథలో ఏదో ఉందంటూ ప్రమోషన్ లో ఊదరగొట్టడంతో రావణాసుర హాట్ టాపిక్ అయింది. అయితే విడుదలైన మొదటి రోజు మొదటి ఆటకే పరమ డిజాస్టర్ అనిపించుకుంది. దీంతో డిస్టిబ్యూటర్లు బాగానే ఆర్థింగా నష్టపోయారు.

 

ఇక యంగ్ హీరో. వరసపెట్టి సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాది కూడా ఇదే పరిస్థితి. కంటెంట్ ఉన్న సినిమాలు చేసే అబ్బవరం, మీటర్ తో ఫక్తు మాస్-మాసాలా సినిమా ఎంచుకున్నాడు. ఏదో పెద్ద హీరోలు చేయాల్సిన కథని ఈ కుర్ర హీరో ఎంచుకున్నాడు. పైగా ఆయన బాడీకి ఏమాత్రం సెట్ అవ్వలేదు.

 

మరో సినిమాశాకుంతలం. చాలా కాలం తర్వాత తెలుగులో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా వచ్చింది. కాళిదాసు రచించిన అభిజ్ఞానశాకుంతలం ఆధారంగా, సమంత లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమా ఏ సెక్షన్ ఆడియన్స్ కూ నచ్చలేదు. పిల్లా-పెద్ద, యువత, మహిళ ఇలా అన్ని వర్గాలవారు ముక్తకంఠంతో తిప్పికొట్టిన సినిమా ఇది. స్వయంగా దిల్ రాజే, ‘తన పాతికేళ్ల కెరీర్ లో అతిపెద్ద జర్క్ శాకుంతలం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -