Sita Ramam: గుడ్ న్యూస్.. ఓటీటీలో ప్రసారం కానున్న సీతారామం..!

Sita Ramam:హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా సీతారామం. ఇక అశ్వినీ దత్ స్వప్న సంయుక్తంగా వైజయంతి మూవీస్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించారు. ఇక ఈ సినిమా గత నెల ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. తొలి రోజునే అన్ని భాషలలో మంచి వసూళ్లతో టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాతోనే మృణాల్ ఠాగూర్ తెలుగు ప్రేక్షకులకు తొలిసారిగా పరిచయం కావటంతోతొలిసారి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.

ఇక ఇదంతా పక్కన పెడితే ఏ సినిమా అయిన థియేటర్లో విడుదలైన తర్వాత ఓటీటీ కూడా లో రెండోసారి విడుదల అవుతాయని తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు థియేటర్లో సక్సెస్ కాని సినిమాలు ఈ ప్లాట్ఫామ్ పై కొన్ని సందర్భాలలో సక్సెస్ అవుతూ మంచి టాక్ సొంతం చేసుకుంటాయి. నిజానికి ఈ వేదిక ద్వారా సినిమాలు రెండవసారి కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి.

ఇప్పటికే చాలా సినిమాలను ఓటీటీ హక్కులు కొనుగోలు చేసి ఆ వేదిక ద్వారా స్ట్రీమింగ్ చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా సీతారామం కూడా త్వరలో ఓటీటీ ద్వారా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఈ మధ్యనే ఈ సినిమా హిందీలో కూడా విడుదల చేయగా అక్కడ కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది.

దీంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తికావడంతో ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఇక ఈనెల 9 నుంచి ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక దీనికి సంబంధించి డిజిట‌ల్ హ‌క్కుల‌ను అమెజాన్ సంస్థ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇక ఈ సినిమా ఈ వేదికపై ఎటువంటి సక్సెస్ అందుకుంటుందో చూద్దాం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -