Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి జోడీగా మనవరాలి వయస్సు ఉన్న అమ్మాయి.. ఇదేం ఘోరమంటూ?

Chiranjeevi:  తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా సీతారామం. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాతో ఒక్కసారిగా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఈమె క్రేజ్ పెరిగిపోతోంది. టాలీవుడ్ లో పలువురు దర్శకులు నిర్మాతలు ఈ ముద్దుగుమ్మ వైపే మొగ్గు చూపిస్తున్నారు. నానితో హాయ్ నాన్న విజయ్ దేవరకొండ తో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం తాజాగా ఈ ముద్దుగుమ్మ మరొక బంపర్ ఆఫర్ ను కొట్టేసినట్టు తెలుస్తోంది. అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాని దర్శకుడు వశిష్టతో చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందట. ఆ పాత్రకు మృణాల్ ఠాకూర్ అయితేనే న్యాయం చేయగలదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇందుకోసం మేకర్స్ ఆల్రెడీ ఆమెను సంప్రదించినట్లు కూడా ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఈ వార్త ఎంతవరకు నిజమో అన్నది తెలియదు. ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారట. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మరి మెగాస్టార్ సరసన నటించడానికి మృణాల్ ఠాకూర్ ఓకే చెప్తుందా లేదా అన్నది చూడాలి మరి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ మెగాస్టార్ చిరంజీవికి మనవరాలు వయసు ఉన్న అమ్మాయి హీరోయిన్ గానా ఇది ఎక్కడ గోరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే మరి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -