Mrunal Thakur: పెళ్లికి వయస్సుతో పని లేదు కానీ దానికి మాత్రం వయస్సు కావాలి.. మృణాల్ సంచలన వ్యాఖ్యలు!

Mrunal Thakur: సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె నటించిన మొదటి తెలుగు సినిమాతోనే ఎంతోమంది తెలుగులో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా తెలుగులో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండగా బాలీవుడ్లో మూడు సినిమా అవకాశాలను అందుకుని బిజీగా ఉన్నారు.

ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తెలుగులో కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 21వ తేదీ విడుదల కానుంది. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె వ్యక్తిగత విషయాల గురించి ముఖ్యంగా పెళ్లి గురించి కొన్ని విషయాలు తెలియజేశారు.

 

తనకు వివాహ వ్యవస్థ పై నమ్మకం ఉందని తెలిపారు. మనకు ఇష్టమైనటువంటి వ్యక్తి మన అభిరుచులకు అనుగుణంగా ఉన్నటు వంటి వ్యక్తి దొరికితే వెంటనే పెళ్లి చేసుకోవాలని అలాంటి వ్యక్తులు దొరికినప్పుడు పెళ్లికి వయసుతో సంబంధం లేదని ఈమె తెలియజేశారు.మా కుటుంబంలో చాలామంది పెళ్లిళ్లు చేసుకుని ఎంతో సంతోషంగా ఉన్నారు వారిని కనుక చూస్తే అసలు వీళ్ళు ఒకరికోసమే మరొకరు పుట్టారా అనేలా ఉంటుందని తెలిపారు.

 

ఈ విధంగా మనకు నచ్చిన విధంగా మన మనస్తత్వానికిసరిపోయే వ్యక్తి దొరికినప్పుడు మనం 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు అలాంటి వ్యక్తి తారాసపడితే అసలు ఆలోచించవద్దు అంటూ ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక సీతారామం సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాని ఎంతో ఆదరించి తనని కూడా తమ కుటుంబ సభ్యులుగా చూసిన తెలుగు ప్రేక్షకులకు తాను ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -