Gudivada Amarnath: వైరల్ అవుతున్న గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు!

Gudivada Amarnath: సాధారణంగా ఒక రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండడం సర్వసాధారణం అధికార పార్టీ చేసే పనులపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉండటం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ప్రస్తుత అధికార పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు మధ్య జరిగినటువంటి ఒక సంఘటన గురించి తెలియజేశారు. ఇక గుడివాడ అమర్నాథ్ తన సోదరి వివాహం కోసం బొత్స సత్యనారాయణ గారితో కలిసి రాజశేఖర్ రెడ్డి గారిని పెళ్లికి ఆహ్వానించడానికి వెళ్లారట.

ఇలా రాజశేఖర్ రెడ్డి గారిని ఆహ్వానించడం కోసం వెళ్లి తనకు కార్డు ఇచ్చి తప్పకుండా రావాలి సార్ అని పిలవగా ఆయన కార్డు తీసుకొని అలా టేబుల్ మీద పెట్టి ఆయన వస్తున్నారా అంటూ చంద్రబాబు గురించి అడిగారు. ఇలా చంద్రబాబు నాయుడు వస్తే తాను పెళ్ళికి రానని చెప్పారు. అప్పటికి తనకి కేవలం 23 సంవత్సరాలు వయసు మాత్రమే ఉందని అమర్నాథ్ తెలిపారు.

 

ఇక రాజశేఖర్ రెడ్డి గారికి పెళ్లి పత్రిక ఇచ్చి బొచ్చ గారితో పాటు బయటకు వచ్చాను. వస్తారు కదా సార్ అంటే వస్తారు అంటూ నన్ను బయటకు తీసుకువెళ్లారు అయితే రాజశేఖర్ రెడ్డి గారు పెళ్లికి రాలేదని తెలిపారు. ఇక హైదరాబాదులో రిసెప్షన్ ఏర్పాటు చేశాము కనీసం అక్కడకైనా వస్తారని అనుకున్నాను అక్కడికి వెళ్లి పిలవగా ఆయన వస్తున్నాడు కదా అంటూ మరోసారి అదే మాట అడిగారు.

 

చంద్రబాబు నాయుడు గారు పెళ్లికి వస్తే తాను రానని రాజశేఖర్ రెడ్డి గారు తెలిపారని అమర్నాథ్ వెల్లడించారు.అయితే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకు అలా అన్నారో తనకు అర్థం కాలేదని ఈయన తెలియజేశారు ఇంకా దాదాపు పది సంవత్సరాలు పాటు తాను టిడిపిలో కొనసాగానని అమర్నాథ్ వెల్లడించారు సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి గొడవలు పడుతూ ఉపవాసాలు ఉన్నామని కానీ అక్కడ చంద్రబాబునాయుడు వ్యవహార శైలి తమకు నచ్చకపోవటం వల్లే పార్టీ నుంచి బయటకు వచ్చాము అంటూ అమర్నాథ్ తెలిపారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -