Akhil-Prashanth neel: అఖిల్ ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ తెరకెక్కనుందా?

Akhil-Prashanth neel: అక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాపై సురేందర్ రెడ్డి అఖిల్ సైతం ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజే మొదటి షో నుంచి డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో మేకర్స్ సైతం భారీగా నష్టపోయారని తెలుస్తోంది.

బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అనంతరం అఖిల్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చారు. మొదటి సినిమాతోనే ఎన్నో అంచనాలు పెంచుకున్న అఖిల్ మొదటి సినిమా కూడా ప్రేక్షకులను ఇలాగే నిరాశపరిచింది. ఇలా ఈయన ఇప్పటివరకు ఐదు సినిమాలలో నటించగా ఇందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మినహా మిగిలిన సినిమాలన్నీ అక్కినేని అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించాయి.

 

అఖిల్ సినిమాలు ఇలా సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటో తెలియదు కానీ ఈయన నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫెయిల్యూర్ కావడంతో అఖిల్ ఇకపై తన సినిమాల స్క్రిప్ట్ విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే అఖిల్ కే జి ఎఫ్ వంటి అద్భుతమైన సినిమాని ప్రేక్షకులకు అందించిన పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.

 

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లు పూర్తి చేసిన తర్వాత అఖిల్ తో ఒక సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. ఈ విధంగా ప్రశాంత్ నీల్ అఖిల్ కాంబినేషన్లో సినిమా రాబోతుందని తెలియడంతో అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ డైరెక్టర్ కాంబినేషన్లో అఖిల్ సినిమా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -