Salaar: సలార్ మూవీ మిగిల్చిన నష్టాల లెక్క తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Salaar: బాహుబలి సినిమాతో ఒక రేంజ్ హిట్ ని సొంతం చేసుకొని ఆపై వరల్డ్ వైడ్ గా క్రేజ్ ని సంపాదించుకున్నాడు మన టాలీవుడ్ టాప్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా సినిమా అనగానే ముందుగా అందరికీ ప్రభాస్ గుర్తొస్తాడు అంతలా క్రేజ్ పెగిపోయింది. బాహుబలి విజయం అతనికి ఎంత సంతోషాన్ని ఇచ్చిందో అంత బాధని కూడా మిగిల్చింది అనిపిస్తుంది ప్రెసెంట్ సిచువేషన్ చూస్తుంటే.

 

ఎందుకంటే బాహుబలి ఇచ్చిన హిట్ మరి ఏ సినిమా తోను అందుకోలేకపోతున్నాడు ప్రభాస్. రాధేశ్యాం, సాహో సినిమాలను పక్కన పెడితే హిట్ టాక్ తెచ్చుకున్న సలార్ కూడా లెక్కల ప్రకారం ఇంకా నష్టాల్లోనే ఉంది అని చెప్తున్నారు. సలార్ సీజ్ ఫైర్ అనే మూవీని చేసిన ప్రభాస్ ఆరంభంలో భారీ స్పందనని అందుకున్నాడు కానీ తర్వాత నుంచి మాత్రం దీనికి రెస్పాన్స్ క్రమంగా పడిపోతోంది.

ఈ నేపథ్యంలో సీజ్ ఫైర్ మూవీకి 20 రోజుల్లో నైజాంలో 60 కోట్లు, సీడెడ్ లో 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 60 కోట్లతో కలిపి తెలుగులో 144 కోట్లు బిజినెస్ చేసింది. అలాగే కర్ణాటకలో 30 కోట్లు, తమిళనాడులో 12 కోట్లు, హిందీలో 75 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంలో 3 కోట్లు కేరళలో 6 కోట్లు ఓవర్సీస్ లో 75 కోట్లతో 345 కోట్లు బిజినెస్ జరిగింది. 20వ రోజు వచ్చేసరికి ఆ కలెక్షన్స్ మరింత తగ్గిపోయాయి.

 

దీంతో 27 రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 10 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాలను కలుపుకొని ఈ చిత్రం 50 లక్షలను వసూలు చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకోవాలంటే ఇంకా కొన్ని కోట్ల కలెక్షన్ వసూలు చేయవలసి ఉంది. ఈ లెక్కల్ని బట్టి చూస్తే సలార్ నష్టాల్లోనే ఉంది అంటున్నారు సినీ క్రిటిక్స్.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -