NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోల్ ను దర్శకుడు అలా డిజైన్ చేశారా?

NTR: కే జి ఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఏకంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుందని తెలుస్తుంది. అయితే ఈ రెండు సినిమాలు కూడా ప్రశాంత్ నీల్ మాఫియా నేపథ్యంలోనే తెరకెక్కించారు.

సలార్ సినిమా పూర్తి కాగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారికి ప్రకటన కూడా వెలువడింది. అయితే ఎన్టీఆర్ సినిమాని కూడా ప్రశాంత్ మాఫియా నేపథ్యంలోని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తారా లేక మరేదైనా వేరే జోనర్ లో చూపించబోతున్నారా అనే సందేహం అందరిలోనూ ఏర్పడింది.

 

తాజాగా ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ మాఫియా పాత్రలకు దూరంగా ఉండబోతున్నారని అలాంటి తరహా పాత్రలో కాకుండా దేశభక్తి ఉన్నటువంటి ఓ నాయకుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూపించబోతున్నారని తెలుస్తోంది. స్వాతంత్రం రాకముందు ఇండియా పాకిస్థాన్ సరిహద్దుల్లో జరిగిన పోరాటం ఆధారంగా ఒక కథను తయారు చేశారట. తారక్ వీర దేశభక్తుడిగా చూపించబోతున్నారని సమాచారం.

 

ఇకపోతే ఎన్టీఆర్ తాజాగా నటించిన త్రిబుల్ ఆర్ సినిమాలో కూడా ఇదే తరహా పాత్రలో నటించారు కానీ ఈ పాత్ర కేవలం ఒక పాప చుట్టూ మాత్రమే తిరుగుతుందని ఈ సినిమాలో మాత్రం ఎన్టీఆర్ పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది.అయితే ఈ సినిమాకు సంబంధించి ఫోటోషూట్ కూడా ఈ ఏడాది నిర్వహించబోతున్నారని వచ్చే యేడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందంటూ ఓ వార్త వైరల్ అవడంతో ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -