Himalayas: వయాగ్రా కోసం అక్కడికి వెళ్లిన అమ్మాయిలు.. ఆ తర్వాత ఏమైందంటే?

Himalayas: స్త్రీ పురుషులు శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనడం కోసం వయాగ్రాని ఉపయోగిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పురుషులు భాగస్వామిని సంతృప్తి పరచడం కోసం శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనడం కోసం ఈ వయాగ్రా టాబ్లెట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా వయాగ్రాని ఉపయోగిస్తున్నట్లు ఒక సర్వేలో కూడా తేలింది. తాజాగా వయాగ్రా కోసం ఒక నలుగురు అమ్మాయిలు వెళ్లి కనపడకుండా వయ్యారు. నలుగురు అమ్మాయిలు ఏంటి?వయాగ్రా కోసం వెళ్లడం ఏంటి?అసలు ఏం జరిగింది ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నేపాలీలు శృంగార పరంగా అద్భుతమైన శక్తిని ఇచ్చే మూలికగా హిమాలయన్ వయాగ్రాను భావిస్తూ ఉంటారు. శిలీంధ్రాల వంటి మూలికలను తీసుకోవడానికి వందలాది గ్రామస్థులు వేసవిలో హిమాలయాల దిగువ ప్రాంతాలకు వెళుతుంటారు. ఈ హిమాలయన్ వయగ్రా కోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో మంచు ప్రాంతాలకు పెద్ద యెత్తున వెళుతుంటారు. ఇలా వెళ్లిన వారిలో ఒకరు, ఇద్దరు కనిపించకుండా పోవడం అన్నది అక్కడ సాధారణమే. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దార్చులా జిల్లాకు చెందిన ప్రజలు వయాగ్రా కోసం హిమాలయాలకు వెళుతూ ఉంటారు. ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు.

 

ఈ సారి కూడా పెద్ద యెత్తున ఈ వయాగ్రా కోసం ప్రజలకు వెళ్లారని తెలుస్తోంది. అలా వెళ్ళిన వారు హిమాపాతం భారీన పడి ఐదుగురు గల్లంతు అయినట్లు అధికారుల దృష్టికి వెళ్లింది. మంగళవారం బయాస్ గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేసుకున్న సమయంలో భారీ హిమపాతం ముంచెత్తగా ఆ ప్రమాదంలో ఐదుగురు కనిపించకుండా పోయారని, ఏడుగురు తప్పించుకున్నట్లు దార్చులా జిల్లా అధికారి ప్రదీప్ సింగ్ ధామి తెలిపారు. వీరిలో నలుగురు మహిళలు కాగా, ఒక పురుషుడు ఉన్నారని తెలిపారు. వీరి జాడ కోసం 72 గంటల నుండి డజన్ల కొద్దీ పోలీసులు వెతుకుతున్నారని, వారు కనిపించకుండా పోయిన ఈ ప్రాంతం జాతీయ రాజధాని ఖాట్మండుకు వాయువ్యంగా 500 కిమీ దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో నిరంతరంగా కురుస్తున్న మంచు, వర్షం కారణంగా తప్పిపోయిన గ్రామస్థుల అన్వేషణకు ఆటంకం ఏర్పడిందని ధామి వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh Assembly Elections: గులకరాళ్లతో, పసుపు చీరలతో రాజకీయాలు.. ఏపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?

Andhra Pradesh Assembly Elections: మరొక రెండు వారాలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ విధంగా ఎన్నికల త్వరలో జరగబోతున్నటువంటి...
- Advertisement -
- Advertisement -