KTR: జగన్ సర్కార్ చేసిన అతిపెద్ద తప్పిదం ఏంటో తెలుసా?

KTR: ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఆ రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గాలి నిరుద్యోగం తగ్గాలి అంటే పెద్ద ఎత్తున రాష్ట్రానికి కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడితే ఆ రాష్ట్రంలో ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు లభించి నిరుద్యోగం తగ్గుతుంది . అప్పుడే ఆర్థికంగా రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందడమే కాకుండా రాష్ట్ర సంపద కూడా అభివృద్ధి చెందుతుంది అనే విషయం మనకు తెలిసిందే. అందుకే పెద్ద ఎత్తున పరిశ్రమలను తమ రాష్ట్రానికి తీసుకురావడం కోసం కృషి చేస్తుంటారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు చాలా విభిన్నమని తెలుస్తుంది.

రాష్ట్రానికి కంపెనీలను తీసుకురావడం మాట పక్కన ఉంచితే వచ్చిన కంపెనీలను కూడా పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారు.ఇప్పటికే జాకీ కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని భావించగా కొన్ని కారణాలవల్ల అది పక్క రాష్ట్రానికి వెళ్లింది. అలాగే ప్రముఖ బ్యాటరీ తయారీ సమస్త అమర రాజాకంపెనీ కూడా తెలంగాణకు వెళ్ళిపోయింది. ఇక ఈ కంపెనీ మహబూబ్ నగర్ లో ప్రారంభించగా మంత్రి కేటీఆర్ స్వయంగా శంకుస్థాపన చేశారు.

 

ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఈ కంపెనీ ముందుగా ఆంధ్రప్రదేశ్ కి రాగా ఇక్కడ ప్రభుత్వం ఈ కంపెనీ కారణంగా అధిక కాలుష్యం ఏర్పడుతుందని, ఇందులో 75% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని 25% ఇతరులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఈ కంపెనీలో పని చేసే కార్మికులకు కాలుష్యం కారణంగా
కార్మికుల ర‌క్తంలో లెడ్ ప‌రిమాణం లెక్క‌కు మించి ఉందనీ చెబుతూ ఈ కంపెనీని తమ రాష్ట్రంలోకి ఆహ్వానించకుండా పక్క రాష్ట్రానికి పంపించారు.

 

ఇక తెలంగాణలో శంకుస్థాపన చేసినటువంటి కేటీఆర్ ఈ కంపెనీ గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. అమరరాజా గ్రూప్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ తయారీలోనే అతిపెద్ద పెట్టుబడి పెట్టడం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. లిథియంతో బ్యాటరీలు ఉత్పత్తి చేస్తారు. దీంతో పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. పదేళ్లలో అమరరాజా రూ.9 వేల 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.ఈ కంపెనీ ద్వారా పదివేల మందికి పైగా ఉద్యోగాలు పొందనున్నారు త్వరలోనే ఈ కంపెనీ మరింత విస్తీర్ణం కూడా కానుందని తెలియజేశారు. ఇలా కేటీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు జగన్ కి వినపడుతున్నాయా ఇంత మంచి కంపెనీని చేతులారా వదులుకోవడం ఎంతవరకు సమంజసమో తెలుస్తోందా అంటూ పలువురు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -