Krithi Shetty-Chaitanya:చైతన్య కృతిశెట్టి ప్రేమలో ఉన్నారా.. పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందా?

Krithi Shetty-Chaitanya: టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారీటి సంపాదించుకున్న వారిలో కృతి శెట్టి ఒకరు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఉప్పెన సినిమాతో ఉప్పెనలా దూసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. అయితే ఉప్పెన సినిమా తర్వాత అంతో ఇంతో హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా అంటే బంగార్రాజు అని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉంటే కృతి శెట్టి తాజాగా నటించిన చిత్రం కస్టడీ. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించిన విషయం తెలిసిందే. మే 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్ లు ఆ అంచనాలను మరింత పెంచేసాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా కృతి శెట్టి మాట్లాడుతూ.. మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎక్కడెక్కడ నుంచి మీరందరూ మాకోసం వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 

ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దానికి కారణం మీరు చూపించిన ప్రేమ ఆదరాభిమానాలే అని తెలిపింది. అనంతరం నాగచైతన్య గురించి మాట్లాడుతూ ఎప్పటికీ నా బంగారు రాజు అంటూ స్టేజ్ పై నాగచైతన్య పై ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది. దీంతో కృతి శెట్టి మాటలపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కృతి శెట్టి నాగ చైతన్యతో ప్రేమలో ఉందని అందుకే అలా మాట్లాడింది అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య కృతి శెట్టి కలిసిన రెండవ సారి నటించిన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -