Bihar: భర్త వేదించడంతో ఊహించని నిర్ణయం తీసుకున్న భార్య?

Bihar: సమాజంలో దాదాపు 70 శాతం వివాహతలు వైవాహిక జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. మరి ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారు అదనపు కట్నం వేధింపులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అటు అత్తింటి వారికి చెప్పలేక ఇటు పుట్టింటి వారికి చెప్పుకోలేక మధ్యలో నరకయాతనను అనుభవిస్తున్నారు. వరకట్నపు వేధింపుల కారణంగా నెలలో పదుల సంఖ్యలో వివాహితల మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పెళ్లయిన నెలకి ఒక నూతన వధువుకి అలాంటి చేదు అనుభవం ఎదురయింది.

దాంతో ఆ నూతన వధువు ఒక ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే.. ఈ సంఘటన బిహార్‌లోని సుపాల్‌లో చోటుచేసుకుంది. బిహార్‌ లోని సుపాల్‌కు చెందిన దీపక్‌ శర్మకు అదే ప్రాంతానికి చెందిన శాంతి దేవికి నెల రోజుల క్రితం రెండు కుటుంబాల సభ్యులు హిందూ సాంప్రదాయం ప్రకారం ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి కూతురు తరపు వారు ఇవ్వవలసిన లాంఛనాలు అన్నీ ఇచ్చేశారు. శాంతిదేవి అత్తారింట్లో ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది. పెళ్లయిన కొద్దిరోజులు పాటు దీపక్‌, శాంతిల కాపురం సజావుగా సాగింది. తర్వాత నుంచి దీపక్‌ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు.

 

శాంతి దేవిని వరకట్నం కింద బైకు తీసుకురమ్మని వేధించసాగాడు. ఆమె ఎంత చెప్పినా వినకుండా వేధించేవాడు. అంతేకాకుండా మానసికంగా, శారీరకంగా ఆమెను టార్చర్‌ చేసాడు. ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన శాంతి ఆశలు
ఆవిరయ్యారు. భర్త వేధింపులు ఆమె తట్టుకోలేకపోయింది. భర్త అసలు నిజ స్వరూపం గురించి పుట్టింటి వారికి చెప్పుకోలేక చివరికి ఆత్మహత్య చేసుకోవలని నిర్ణయించుకుంది.
తాజాగా ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గదిలోకి వెళ్లిన శాంతి ఎంతకీ బయటకు రాకపోయే సరికి అత్తింటివారికి అనుమానం వచ్చింది. వెంటనే తలుపులు బద్దలు కొట్టారు. లోపల శాంతి ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శాంతి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -