Devotional: ఇంటి గోడలపై అలాంటి ఫొటోస్ ఉన్నాయా.. సంపద మీ వెంటే?

Devotional: సాధారణంగా చాలామంది ఇంటిని అందంగా అలంకరించుకోవడం కోసం గోడలపై రకరకాల ఫోటోలను తగ్గించుకుంటూ ఉంటారు. ఫ్యామిలీ ఫోటోలను,ప్రకృతికి సంబంధించిన, దేవుళ్లకు సంబంధించిన ఫోటోలను లేదంటే జంతువులకు సంబంధించిన ఫోటోలను ఇంటి గోడల పై అతికిస్తూ ఉంటారు. కొంతమంది వివిధ రకాల బొమ్మలను అలంకరిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో మనం గోడలకు అతికించే ఫొటోస్ మన జీవితం పై ప్రభావాన్ని చూపిస్తాయి. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో ఏడు గుర్రాల చిత్రాన్ని ఉంచడం చాలా శుభప్రదం.

ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీనీ ఆకర్షిస్తుంది. ఇంట్లో నివసించే అందరి జీవితాలు అభివృద్ధి వైపు సాగుతాయి. ఇంట్లో ఏడు గుర్రాల పెయింటింగ్ ఉంచితే లక్ష్మీ కటాక్షం దొరికి ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు. అలాగే సంఘంలో గౌరవం పొందుతారు. ఇంట్లో సౌకర్యాలు పెరుగుతాయి. ఏడుగుర్రాల పెయింటింగ్ ఇంట్లో పెట్టుకోవాలనుకున్నపుడు కొన్ని నియమాలను పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఆ ఫోటోలలో గుర్రాలన్నీ స్పష్టంగా కనిపించాలి.
గుర్రాలను పగ్గాలతో బంధించి ఉంచకూడదు.
గుర్రాల ముఖాలు ప్రసన్నంగా కనిపించాలి.
అన్ని గుర్రాలు ఒకే దిశలో పరుగెడుతున్నట్టు ఉండాలి.

 

ఈ చిత్రాన్ని ఇంట్లో తూర్పువైపు ఉన్న గోడకు అలంకరించాలి. ఆఫీస్ లేదా వ్యాపార స్థలాల్లో దక్షిణం వైపు గోడకు పెట్టుకోవడం మంచిది.
ఇంట్లో ఏడు గుర్రాల పెయింటింగ్ శుభప్రదం. అయితే ఈ గుర్రాలు వేర్వేరు దిశల్లో పరుగెడుతున్నట్టు ఉండకూడదు. ఒక్క గుర్రం ఉండే పోస్టర్ ఇంట్లో అసలు పెట్టుకోకూడదు. రథం లాగుతున్న గుర్రం ఫోటోలు కూడా పెట్టుకోకూడదు. యుద్ధ భూమిలో పోరాటంలో ఉన్న గుర్రం చిత్రం కూడా ఇంట్లో పెట్టుకోవడానికి పనికి రాదు. ఇలాంటి గుర్రాల ఫోటోలు ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. సంపద నశించి, దారిద్య్రం చేరుతుంది. అలాగే కోపంతో ఉన్న గుర్రం బొమ్మ ఇంట్లో పెట్టుకోకూడదు. ఫోటోలో ఉండే ఏడు గుర్రాలు ఒకే రంగులో ఉండాలి. గుర్రాలు నిలబడి లేదా, కూర్చుని ఉన్న చిత్రాలు కూడా ఇంటికి అంత మంచిది కాదు. దీని వల్ల ఆర్థిక స్థితి దెబ్బతింటుంది. ఇంట్లో గొడవలు పెరుగుతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -