Bigg Boss: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ …. త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్7!

Bigg Boss: బుల్లితెరపై ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి బుల్లితెర రియాలిటీ షో లలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి.ఇప్పటికే ప్రతి ఒక్క భాషలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని సీజన్ల పాటు దూసుకుపోతున్న ఈ రియాలిటీ షో తెలుగులో ఆరు సీజన్లను పూర్తిచేసుకుని ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతోంది. అయితే ఈ సీజన్ గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి.

ఈ సీజన్ ప్రసారానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభం కాబోతుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సీజన్ ప్రసారానికి ముహూర్తం ఖరారు చేశారని తెలుస్తుంది.గత సీజన్లలో ముందుగానే షో గురించి అన్ని విషయాలు లీక్ అవడంతో ఎంతోమంది ఈ సీజన్ల పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా పగడ్బందీగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.

 

నయా రూల్స్, గేమ్స్ తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచాలని ఫిక్స్ అయ్యారట. ఇక జూన్ నుండి కంటెస్టెంట్స్ ఎంపిక మొదలు కానుందట. కనీస పాపులారిటీ ఉన్న సెలెబ్రిటీలను హౌస్లోకి పంపించబోతున్నారని సమాచారం. గత సీజన్లో ఏమాత్రం పాపులారిటీ లేనటువంటి వారిని పంపించడం వల్ల షో టిఆర్పి రేటింగ్ భారీగా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే ఈసారి అలా కాకుండా పాపులారిటీ ఉన్నటువంటి వారిని హౌస్ లోకి కంటెస్టెంట్లుగా పంపించబోతున్నారని సమాచారం.

 

ఈ క్రమంలోనే జులై మొదటి వారంలో కెల్లా కంటెస్టెంట్లను ఎంపిక చేసి సెప్టెంబర్ మొదటి వారంలోని బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభించాలని ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ హోస్ట్ విషయంలో కూడా నాగార్జునతో పాటు ఇతర హీరోలను కూడా సంప్రదిస్తున్నారని, టాప్ హీరోస్ ఎవరు కూడా ముందుకు రాని పక్షంలో తిరిగి ఈ సీజన్ కి కూడా నాగార్జునను హోస్టుగా ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా రానుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -