Ambati Arjun: అంబటి అర్జున్ కూతురు పేరు ఇదే.. కూతురికి భలే పేరు పెట్టారంటూ?

Ambati Arjun: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ గా అంబటి అర్జున్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన అంబటి అర్జున్ టాప్ సిక్స్ వరకు రావడం గమనార్హం.ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచి తన మాట తీరుతో ప్రేక్షకులని మెప్పించాడు. ప్రతి టాస్క్ లోను ఎవరు సపోర్టు లేకుండా ఒంటరిగానే ఆడి గెలిచాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లోనే అర్జున్ భార్య సురేఖకు శ్రీమంతం చేసిన సంగతి తెలిసిందే.

 

తర్వాత గ్రాండ్ ఫినాలే రోజు అర్జున్ మాట్లాడుతూ తనకు పాప పుట్టినా,బాబు పుట్టినా అర్ఖ అని పేరు పెట్టుకుంటానని చెప్పాడు తన పేరులోంచి ఆర్ సురేఖ పేరు నుంచి ఖ తీసుకొని ఆ పేరు పెట్టుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. తనకు కూతురు పుట్టాలని ఆశగా ఉందని చెప్పిన అంబటి అర్జున్ ఇప్పుడు తను కోరుకున్నట్లుగానే ఆడపిల్లకి తండ్రి అయ్యాడు. అనుకున్నట్లుగానే పాపకి అర్ఖ అని పేరు పెడుతున్నట్లు చెప్పేశాడు.

ప్రస్తుతం బుల్లితెరపై పలు షోస్ సీరియల్స్ చేస్తున్నాడుఅర్జున్. అలాగే హౌస్ లో ఉండగానే బంపర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్ చరణ్ కాంబోలో బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న సినిమాలో అర్జున్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ విషయం బుజ్జి బాబు బిగ్ బాస్ స్టేజ్ పైన స్వయంగా చెప్పడం అందరికీ తెలిసిందే.అగ్నిసాక్షి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అర్జున్ ఈ సీరియల్ స్టార్ మా లో ప్రసారమయ్యేది.

 

అప్పట్లో ఇది టాప్ ఫైవ్ ప్లేస్ లో దూసుకుపోయేది. ఆపై దేవత సీరియల్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు అంబటి అర్జున్ ఇద్దరు భార్యలతో బుల్లితెర శోభన్ బాబు గా పేరు సంపాదించాడు. ఏది ఏమైనప్పటికీ ఆడపిల్ల కావాలనే తన కోరిక తీరునందుకు సంతోషం లో మునిగిపోయాడు అర్జున్.

Related Articles

ట్రేండింగ్

Chiranjeevi: చిరంజీవిపై విషం చిమ్మడం పాత్రికేయమా.. ఇది వ్యభిచారం కాదు వెబ్ చారమ్ అంటూ?

Chiranjeevi: ప్రస్తుత కాలంలో ఒక్కొక్క మీడియా సంస్థ ఒక్కొక్క రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకించి చానల్స్ పెట్టుకోవడం కూడా గమనార్హం. అయితే ఒక...
- Advertisement -
- Advertisement -