Amardeep: అమ్మ ముందే అలాంటి బూతులు.. అమర్ దీప్ కామెంట్స్ వైరల్!

Amardeep: బిగ్ బాస్ సెవెన్ లో రన్నరప్ గా నిలిచాడు అమర్ దీప్. టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి గట్టి పోటీని ఇచ్చాడు. బిగ్ బాస్ సమయంలో వీళ్ళిద్దరికీ మాటల యుద్ధాలు జరిగాయి. స్పై బ్యాచ్ ఒకవైపు ఉంటే స్పా బ్యాచ్ మరొకవైపు ఉండేది. అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ ని ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమరదీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్ళింది. దాని గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు అమర్దీప్.

 

హౌస్ నుంచి నేను బయటికి రాగానే ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు నా మైండ్ బ్లాంక్ గా ఉంది. అందరూ నన్ను దాక్కోమన్నారు. కానీ నేను ఏ తప్పు చేయలేనప్పుడు ఎందుకు దాక్కోవాలి అని కారు తీశాను అందులో అమ్మ, తేజు ఇద్దరు ఉన్నారు నేను లైట్లు వేసేసరికి నా కారు చుట్టూ కొన్ని కార్లు రౌండ్ అప్ చేసి కారు అద్దాలు పగలగొట్టేసారు. నన్ను నానా బూతులు తిట్టారు. ఒక తల్లి ముందు ఏ కొడుకు ఇలాంటి మాటలు పడకూడదు. అలాగే నీ భార్యని తీసుకువెళ్తాము అంటూ బూతులు మాట్లాడారు.

ఎవరైనా వాళ్ల భార్యల గురించి అలా మాట్లాడితే వాళ్ళు భరించగలరా.. నేను కూడా రియాక్ట్ అవ్వగలను, వాళ్లపై కేసులు పెట్టగలను కానీ వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి అని ఆలోచించాను. అది కేవలం ఒక గేమ్.గేమ్ లో ప్రారంభమైన గొడవలు గేమ్ లోనే ముగిసిపోయాయి అని ఎమోషనల్ అయ్యాడు అమర్ దీప్.

 

అక్కడితోనే ఆ గొడవ ముగిసిపోయింది బిగ్ బాస్ వల్ల నాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది అంతేకాకుండా అభిమానుల ప్రేమ దొరికింది అన్నిటికి మించి నా అన్న రవితేజ సినిమాలో ఛాన్స్ దొరికింది. బిగ్బాస్ విన్నవటం కన్నా నాకు రవితేజ సినిమాలో అవకాశం దొరకటమే గొప్ప విజయం. ఇవన్నీ కూడా బిగ్ బాస్ ద్వారా వచ్చిన అచీవ్మెంట్స్ అని నేను భావిస్తాను అని చెప్పుకొచ్చాడు అమర్దీప్.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -