Vastu Tips: నైరుతిలో అసలు పెట్టకూడని వస్తువులు ఇవే?

Vastu Tips: ప్రస్తుత రోజుల్లో వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో నిర్మాణం మొదలు ఇంట్లో వస్తువుల అమరిక వరకు ప్రతి ఒక్క విషయంలో వాస్తు విషయాలను పాటిస్తున్నారు. ఇది వాస్తు ప్రకారం గా ఇల్లు లేకపోతే ఇంట్లోకి నెగెటివిటీ ప్రవేశిస్తుంది. తద్వారా ఇంట్లో వాళ్లకు మనశ్శాంతి లేకపోవడంతో పాటు ఆర్థికంగా కూడా సమస్యలు రావచ్చు. అయితే ఆ నెగిటివ్ లేదా పాజిటివ్ ప్రభావం ఇంట్లో నివసించే వారిపై కూడా పడుతుంది. వాస్తును అనుసరించి నైరుతి దిక్కును రాహు కేతు దిశగా పరిగణిస్తారు. అందువల్ల ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన వస్తువుల వల్ల నెగెటివిటి పెరుగుతుంది.

మరి నైరుతి దిశలో ఎటువంటి వస్తువులు పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నైరుతిలో పూజగది లేదా ప్రార్థనా స్థలం అసలు ఏర్పాటు చేసుకోకూడదు. ఈ దిక్కున మనసు ఏకాగ్రతతలో ఉండదు. అందువల్ల పూజ జరపడానికి అనుకూలంగా ఉండదు. ఈదిశలో ఏర్పాటు చేసిన దేవి లేదా దేవతల వల్ల పూజా ఫలం లభించదు. అలాగే నైరుతి దిశలో నీటి సంప్ ఉండకూడదు. దానివల్ల వాస్తు దోషం కలుగుతుంది. కానీ రూఫ్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ దిక్కున టాయిలెట్ నిర్మాణం చేస్తే నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇంట్లోని వ్యక్తుల అభివృద్ధి ఆగిపోతుంది. అంతేకాదు ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి.

 

పిల్లల స్టడీ రూం కూడా ఈ దిక్కుగా ఉండకూడదు. ఈ దిక్కున ఏకాగ్రత కుదరడం కష్టం. చదివినవి గుర్తు పెట్టుకోవడం కష్టం అవుతుంది. అందుకే ఇక్కడ రాయడం, చదవడం మాత్రం అంత మంచిది కాదు.
గెస్ట్ రూం కూడా నైరుతి దిక్కున ఉండడం మంచిది కాదు. రాహు, కేతు దిశ కావడం మూలంగా ఇక్కడి ఉండి వారికి ప్రవర్తన, వ్యవహారంలో అకస్మాత్తుగా మార్పులు వస్తాయి. అతడు అందరితో అనుచితంగా ప్రవర్తించవచ్చు. అందువల్ల ఈ దిక్కులో గెస్ట్ రూం కూడా ఉండకూడదు.
ఈ దిక్కులో బరువుగా ఉండే వస్తువులు ఉంచడం మంచిది. బీరువాలు, త్రిజోరి, బుక్ షెల్ఫ్ వంటివి ఈ దిక్కున ఉంచాలి. ఇంటిలోని మిగతా భాగాల కంటే ఈ దిక్కున ఎక్కువ బరువు ఉండాలి. అంతేకాదు ఈ దిక్కున ఇతర దిక్కులతో పోలిస్తే ఎత్తు ఎక్కువగా ఉండాలి. నైరుతిలో అవుట్ హౌజ్ ఉండడం మంచిది. అవుట్ హౌజ్ నిర్మించేంత స్తోమత లేదని అనుకునేవారు ఇంటిలోని ఆ మూలన కాస్త ఎత్తు పెంచి ఉంచుకోవడం మంచిది.
నైరుతి వాస్తుదోశ నివారణకు ఆ దిక్కున మట్టి విగ్రహాల తో అలంకరించుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -